క్రమశిక్షణ కలిగి ఉండాలి
● ఎస్పీ రోహిత్‌రాజు ● ముగిసిన సాయుధ బలగాల డీ మొబిలైజేషన్ పరేడ్
కొత్తగూడెంఅర్బన్: పోలీస్ శాఖలో ప్రతీ ఉద్యోగి క్రమశిక్షణ కలిగి ఉండాలని ఎస్పీ రోహిత్‌రాజు సూచించారు. కొత్తగూడెం హేమచంద్రాపురంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో 15 రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ సిబ్బంది మొబిలైజేషన్ ముగింపు కార్యక్రమం శుక్రవారం జరిగింది. 5 ప్లాటూన్లతో ఏర్పాటు చేసిన పరేడ్‌కు అడ్మిన్ ఆర్‌ఐ లాల్ బాబు కమాండర్‌గా వ్యవహరించారు. సిబ్బంది ఇన్ డోర్, ఔట్‌డోర్, ఫైరింగ్ ప్రాక్టీస్‌లలో సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగింపు వేడుకలకు హాజరైన ఎస్పీ ఆర్మ్‌డ్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని చెప్పారు. మొబిలైజేషన్ కార్యక్రమం ద్వారా శారీరక దృఢత్వంతోపాటు మానసికోల్లాసం కూడా లభిస్తుందని అన్నారు. అనంతరం పోలీస్ శాఖలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 260 అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పతకాలను అందజేశారు. కఠిన సేవా, ఉత్తమ సేవా, సేవా పతకాలతో పాటు యాంత్రిక్ సురక్షా సేవా పతకాలను పరేడ్ మైదానంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, ఎస్బీ సీఐలు నాగరాజు, శ్రీనివాస్, అడ్మిన్ ఆర్‌ఐ లాల్‌బాబు, హోంగార్డ్ ఆర్‌ఐ నరసింహారావు, ఎంటిఓ సుధాకర్, వెల్ఫేర్ ఆర్‌ఐ కృష్ణారావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment