విద్యుత్ శాఖ ఎస్‌ఈ మహేందర్
సూపర్‌బజార్(కొత్తగూడెం): బంజరు భూములు, వ్యవసాయానికి అనుకూలంగా లేని భూముల్లో సౌర విద్యుత్ ఉత్పత్తికి రైతులు ముందుకు రావాలని విద్యుత్ శాఖ ఎస్‌ఈ జి.మహేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. 500 కిలోవాట్ల నుంచి 4 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొన్నారు. రైతులు, వ్యవసాయ ఉత్పత్తి సంఘాలు, రైతు సమూహాలు, నీటి వినియోగదారుల సంఘాలు, సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, పంచాయతీలు, గ్రామ సంస్థలు, మండల సమాఖ్యలు, డెవలర్స్ దరఖాస్తు చేసుకోవచ్చని, 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు సమీపంలో భూములు ఉంటే లైన్‌ఖర్చులు కూడా తక్కువ అవుతాయని వివరించారు. ఎన్‌పీడీసీఎల్ టారిఫ్ ప్రకారం విద్యుత్‌ను కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు www. tgredco. telangana. gov. in వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలని కోరారు. దరఖాస్తు గడువు ఈ నెల 22వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. ఇతర వివరాలకు టీజీ రెడ్కో డీజీఎం 63049 03933, జీఎం 90005 50974 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment