ఆరోగ్య సేవలపై కేంద్ర బృందం ఆరా
సింగరేణి(కొత్తగూడెం): జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ కమిటీ సభ్యులు ఆరా తీశారు. శుక్రవారం రామవరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. సిబ్బందితో మాట్లాడి కల్పించాల్సిన వసతులపై ఆరా తీశారు. జాతీయ, మాతా శిశు ఆరోగ్య కార్యక్రమాలు, అసంక్రమణ వ్యాధుల నివారణ, ఎమర్జెన్సీ మందుల నిర్వహణ, లేబోరేటరీ నిర్వహణ, గర్భిణులకు ఆరోగ్య సేవలు, వ్యాధి నిరోధక కార్యక్రమాల నిర్వహణపై సమాచారం సేకరించారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డి. ఆర్ రాము, పాత కొత్తగూడెం పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ రాకేష్, నర్సింగ్ ఆఫీసర్ శంకరమ్మ, పబ్లిక్ హెల్త్ మేనేజర్ శ్రీనివాస్, దిలీప్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment