మెగా హెల్త్ క్యాంపులతో ఆరోగ్యం
దుమ్ముగూడెం : మెగా హెల్త్ క్యాంపులు ఆరోగ్యానికి దోహదం చేస్తాయని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి.రాహుల్ అన్నారు. శుక్రవారం మండలంలోని గౌరారం ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఆరోగ్య మిషన్ పథకం ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజనుల కోసం హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శిబిరంలో కంటి, చిన్నపిల్లలు, చర్మ వ్యాధి, చెవి, గొంతు వైద్య నిపుణులతో సేవలందించినట్లు తెలిపారు. గర్భిణులకు స్కానింగ్ సౌకర్యం కూడా కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ భాస్కర్, అధికారులు బాలాజీ, చైతన్య, పుల్లారెడ్డి, రేణుక రెడ్డి, నాగరాజు, సచిన్, మౌనిక, వెంకన్న, వాణి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
జాతరకు ఏర్పాట్లు చేయాలి
భద్రాచలం : సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ సూచించారు. శుక్రవారం తన చాంబర్‌లో అధికారులతో మాట్లాడారు. కరకగూడెం మండలం చిరుమల్లలో జరిగే జాతరకు ఏర్పాటు చేయాలని అక్కడి ఆదివాసీలు కోరారని తెలిపారు. విద్యుత్, శానిటేషన్, తాగునీటి సౌకర్యం, టెంట్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, షవర్ బాత్‌లు, వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. తహసీల్దార్ నాగప్రసాద్, ఎంపీడీవో దేవర ప్రసాద్, విద్యుత్ శాఖ ఏడీ వేణు, డీఈ మధుకర్, ఏఈ యోగేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment