
మోరంపల్లిబంజర సంత వేలం రూ.33.50 లక్షలు
బూర్గంపాడు: మోరంపల్లిబంజర సంత వేలంపాట రూ.33.50 లక్షలకు ఖరారైంది. డీఎల్‌పీఓ సుధీర్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సంత వేలం పాటలో ఆరుగురు పాల్గొన్నారు. ప్రతి గురువారం, శుక్రవారం నిర్వహించనున్న పశువుల సంత, కూరగాయల సంతకు సంయుక్తంగా నిర్వహించిన వేలం పాటను బానోత్ రవీందర్ రూ.33.50 లక్షలకు దక్కించుకున్నాడు. పంచాయతీ కార్యదర్శి భవాని, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కాగా, బూర్గంపాడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించే వారపు సంత వేలంపాటను బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీఓ బాలయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేలంపాటను జక్కం శ్రీనివాసరావు రూ.2.54 లక్షలకు దక్కించుకున్నాడు. ప్రతి బుధవారం బూర్గంపాడులో నిర్వహించే సంత వేలంపాటలో ఎనిమిదిమంది పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శి బర్ల రామకృష్ణ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.