
Tech Giants Fined By China: చైనాకు చెందిన టెక్ దిగ్గజ కంపెనీలకు జిన్ పింగ్ ప్రభుత్వం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. గుత్తాధిపత్యాన్ని అరికట్టే సాకుతో పలు కంపెనీలపై అక్కడి ప్రభుత్వం బరితెగింపు వ్యవహారాలకు పాల్పడుతోంది. తాజాగా చైనాకు చెందిన కంపెనీలపై భారీ జరిమానాను విధించింది. చైనా టెక్ దిగ్గజం జాక్ మాకు చెందిన ఆలీబాబా, టెన్సెంట్‌హోల్డింగ్స్‌పై భారీ జరిమానాను అక్కడి ప్రభుత్వం వేసింది. వీటితో పాటుగా జేడీ.కామ్, బైడూ వంటి దిగ్గజ కంపెనీలు కూడా జరిమానా విధించిన జాబితాలో ఉన్నాయి.
చదవండి: చేసింది చాలు, యాపిల్ కీలక నిర్ణయం..!
అందుకే జరిమానా వేసాం..!
టెక్ దిగ్గజ కంపెనీలపై భారీ జరిమానాను విధించడాన్ని అక్కడి ప్రభుత్వం సమర్థించుకుంది. ఆయా కంపెనీల గుత్తాధిపత్యాన్ని అరికట్టేందుకే చేయాల్సి వచ్చిందని పేర్కొంది. ఆలీబాబా, టెన్సెంట్ హోల్డింగ్స్, జేడీ. కామ్ లాంటి ఇతర టెక్ కంపెనీలు 8 ఏళ్ల క్రితం వరకు చేపట్టిన 43 సంస్థల కొనుగోళ్లను గోప్యంగా ఉంచాయని చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేటర్ వెల్లడించింది. ఆయా కంపెనీలకు చైనా యాంటీ మోనోపలీ చట్టం క్రింద సుమారు 58 లక్షల వరకు జరిమానా విధించినట్లు తెలుస్తోంది.
కొత్తేమీ కాదు..!
టెక్ దిగ్గజ కంపెనీలపై చైనా కొరడా ఝుళిపించడం కొత్తేమి కాదు. గత ఏప్రిల్‌లో వివిధ చట్టాల ఉల్లంఘనల పేరిట అలీబాబాకు 2.8 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది. కొన్ని రోజులపాటు జాక్ మా కన్పించకుండా పోయారు. గత ఏడాది కాలంఓ 344 బిలియన్ డాలర్ల భారీ నష్టాని జాక్ మా కంపెనీలు మూటగట్టుకున్నాయి.
చదవండి: సుజుకీ అవెనిస్ 125 స్కూటర్ ఆవిష్కరణ
Comments
Please login to add a commentAdd a comment