
ముంబై: బ్యాంకుల రుణాలు జూలై 29తో ముగిసిన చివరి రెండు వారాల్లో 14.52 శాతం పెరిగి.. మొత్తం రూ.123.69 లక్షల కోట్లకు చేరాయి. డిపాజిట్లు సైతం 9 శాతానికి పైగా పెరిగి రూ.170 లక్షల కోట్లకు చేరినట్టు ఆర్‌బీఐ బుధవారం విడుదల చేసిన డేటా ఆధారంగా తెలుస్తోంది.
2021 జూలై30తో ముగిసిన రెండు వారాల కాలంలో బ్యాంకుల రుణాలు రూ.108 లక్షల కోట్లుగా, డిపాజిట్లు రూ.155 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇక ఈ ఏడాది జూలై 15తో ముగిసిన రెండు వారాల్లో బ్యాంకుల రుణాలు 13 శాతం పెరగ్గా, డిపాజిట్లలో 8 శాతం వృద్ధి కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment