![Bengaluru: Schneider Electric Company Invest Rs 425 Crores For Smart Factory - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/24/Untitled-2_1.jpg.webp?itok=Ej8j9tfD)
న్యూఢిల్లీ: డిజిటల్ ఆటోమేషన్, ఇంధన నిర్వహణ రంగ సంస్థ ష్నైడర్ ఎలక్ట్రిక్.. బెంగళూరులో నూతన స్మార్ట్ ఫ్యాక్టరీ అభివృద్ధికి రూ.425 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు ప్రకటించింది. ఈ కేంద్రం రాకతో బెంగళూరులోని కంపెనీకి చెందిన 10 ఫ్యాక్టరీలలో ఆరింటిని ఒకే గొడుకు కిందకు తీసుకువస్తుందని సంస్థ తెలిపింది. నూతన కేంద్రాన్ని ప్రస్తు త 5 లక్షల చదరపు అడుగుల నుండి 10 లక్షల చ.అడుగులకు విస్తరిస్తారు.
సింగిల్, త్రీ ఫేజ్ యూపీఎస్, పవర్ డిస్ట్రిబ్యూషన్ యూని ట్స్, రెనివేబుల్ ఎనర్జీ ప్రొడక్ట్స్, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ డేటా సెంటర్లను ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. విస్తరణ ద్వారా కొత్తగా 1,000 మందికి ఉపాధి అ వ కాశాలు లభిస్తాయి. ఇప్పటికే ఈ కేంద్రంలో 2,000 మంది పనిచేస్తున్నట్టు కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment