China ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీనిని కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వడ్డీరేట్లను రికార్డు స్థాయిలో పెంచుతూ పోతోంటే చైనా సర్కార్ మాత్రం ఇందుకు భిన్నమైన వైఖరిని తీసుకుంది. కీలక వడ్డీ రేట్లను మరింత తగిస్తూ చైనా సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు నెలల్లో రెండవసారి అనూహ్యంగా కీలక పాలసీ రేట్లను తగ్గించింది. (రష్యా కేంద్ర బ్యాంకు సంచలనం: ఆర్థిక వేత్తల ఆందోళన)
పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా మంగళవారం మీడియం-టర్మ్ లెండింగ్ రేట్లను 15 బేసిస్ పాయింట్లు తగ్గించి 2.5శాతంగా ఉంచింది. తగ్గించింది. మూడేళ్లలో ఇదే భారీ కోత. బలహీనమైన వినియోగదారుల వ్యయ వృద్ధి, స్లైడింగ్ పెట్టుబడి పెరుగుతున్న నిరుద్యోగం చూపిన జూలై డేటా విడుదలకు కొద్దిసేపటి ముందు ఈ చర్య తీసుకుంది. చైనా ఆర్థిక పరిస్థితి దారుణంగా కనిపిస్తోందనీ గత నెలలో బ్యాంకు రుణాలు 14 సంవత్సరాల కనిష్టానికి పడిపోయాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
చైనా వృద్ధి గణాంకాలు ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో వృద్ధి రేటును వేగవంతం చేసేందుకు పింగ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దేశంలోని నిరుద్యోగిత రేటును వెల్లడించకూడదని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ నిర్ణయించింది. తాజా పరిణామాలతో హాంకాంగ్‌లో చైనా కరెన్సీ యువాన్ విలువ బలహీనపడి.. నవంబర్ 2022 స్థాయికి పడిపోయింది.
భారీగా క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ అశాంతి ప్రమాదాన్ని పెంచుతుందని పెంటగాన్ మాజీ అధికారి, చైనాలో వ్యాపారవేత్త, ఇప్పుడు సింగపూర్‌లోని లీ కువాన్ యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ సీనియర్ ఫెలో డ్రూ థాంప్సన్ వ్యాఖ్యానించారు. అలాగే చైనా ఎదుర్కొంటున్న సవాళ్లు ప్రపంచానికి కూడా చెడ్డ వార్తేనని ఆర్థిక విశ్లేషకులంటున్నారు. చైనాలో నిరంతర పునరుద్ధరణ లేకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆందోళన పెరగడంతో స్టాక్‌లు , బాండ్‌లు క్షీణించాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి 2028 నాటికి ప్రపంచ వృద్ధికి అగ్రగామిగా ఉంటుందని గతంలో అంచనా వేసింది.
చైనా మందగమనం అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమని యుఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ ఈ వారం అన్నారు. ప్రధాన వినియోగ వస్తువుల దిగుమతులు క్షీణిస్తే ఆస్ట్రేలియా నుండి బ్రెజిల్ దాకా ప్రధాన ఉత్పత్తిదారుకు ప్రతికూలం. అలాగే ఎలక్ట్రానిక్స్‌కు స్వల్ప డిమాండ్ ఉన్న దక్షిణ కొరియా, తైవాన్ వంటి వాణిజ్య ఆధారిత ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతుందనేది అంచనా.
మరోవైపు వడ్డీరేట్లను భారీగా పెంచుతూ రష్యా కేంద్రబ్యాంకు తీసుకున్న నిర్ణయం గ్లోబల్‌గా ఆర్థిక వేత్తలను అందోళనకు గురిచేసింది. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగియ నంతవరకు, రష్యాలు ఆంక్షలు కొనసాగుతున్నంత కాలం ద్రవ్యోల్బణం, ఆ దేశ కరెన్సీ పతనానికి వడ్డీరేటు పెంపు తాత్కాలిక పరిష్కారం మాత్రమేనని పేర్కొన్నారు. ఇది అంతర్జాతీయంగా స్టాక్‌మార్కెట్లను ప్రభావితం చేస్తుందని అంచనావేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment