ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ కారు కలిగి ఉండాలని అనుకుంటారు. కార్లను కొంత మంది నిత్యావసరాల కోసం వినియోగిస్తే, మరి కొందరు లగ్జరీ కోసం ఉపయోగించుకుంటారు. ఎవరు ఎలా ఉపయోగించుకున్నా.. ఆ కారుకి బీమా (ఇన్సూరెన్స్) చేయించుకోవడం తప్పనిసరి. అయితే కొంతమంది కారుకి బీమా చేయించుకోవడం ఖర్చుతో కూడుకున్న పని అని మిన్నకుండిపోతారు. కానీ ఖరీదైన బీమాలు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే కొన్ని ప్రీమియం పాలసీలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిని గురించి మనం ఈ కథనంలో తెలుసుకుందాం.
మీ పాత కార్ల కోసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎంచుకోండి:
మీరు పాత కారు కోసం థర్డ్ పార్టీ లేదా సమగ్ర బీమా తీసుకోవచ్చు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌లో మీ కారుకు ఎలాంటి కవరేజీ అందించినప్పటికీ.. సమగ్ర బీమాలో కంపెనీ థర్డ్ పార్టీతో పాటు సొంత డ్యామేజ్ కవరేజీని అందిస్తుంది. ఈ కారణంగా, థర్డ్ పార్టీ బీమా ప్రీమియం కంటే సమగ్ర బీమా ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. మీరు సమగ్ర బీమాకు బదులుగా థర్డ్ పార్టీ బీమాను ఎంచుకుంటే ఎక్కువ డబ్బుని ఆదా చేసుకోవచ్చు.
కారులో యాంటీ థెఫ్ట్ డివైజెస్ ఇన్‌స్టాల్ చేయండి:
కారులో యాంటీ థెఫ్ట్ డివైజెస్ ఇన్‌స్టాల్ చేసుకోవడం ప్రస్తుత కాలంలో చాలా అవసరమని. ఎందుకంటే దానిపై కూడా కారు బీమా ఆధారపడి ఉంటుంది. అప్డేటెడ్ యాంటీ థెఫ్ట్ డివైజెస్ ఉండటం వల్ల దొంగతనాలు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది. కావున కారు సేఫ్టీ ఫీచర్స్ పరిగణనలోకి తీసుకుంటే, బీమా కంపెనీ మీ నుంచి తక్కువ ప్రీమియం వసూలు చేస్తుంది.
అనవసరమైన కార్ మోడిఫికేషన్స్ నివారించండి:
ఆధునిక కాలంలో వాహన ప్రేమికులు తమ వాహనాలను తమకు నచ్చిన విధంగా మోడిఫై చేసుకోవాలనుకుంటారు. అయితే మోడిఫైడ్ కార్ల విలువ సాధారణ కార్ల కంటే ఎక్కువగా ఉంటుంది. కావున కారు విలువ పెరిగే కొద్దీ భీమా ప్రీమియం కూడా పెరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వినియోగదారుడు అవసరమైతే తప్పా కారు మోడిఫికేషన్ చేయకూడదు.
కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం కంపార్ చేసుకోండి:
ఒక కారుకి బీమా పాలసీ తీసుకునే ముందు మార్కెట్లో ఉన్న భీమా పాలసీలు ఏవి, వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి అని ఒకసారి కంపార్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో భీమా పాలసీలను విక్రయిస్తున్న కంపెనీలు లెక్కకు మించి ఉన్నాయి. ఇందులో కూడా మీరు ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ భీమా పాలసీలను ఎంచుకోవచ్చు. మీరు భీమాలను సరిపోల్చుకుంటే తక్కువ ప్రీమియంతో మెరుగైన భీమా పొందే అవకాశం ఉంటుంది.
స్వచ్ఛంద మినహాయింపు చెల్లించండి (Voluntary Deductibles):
కారు కోసం బీమా పాలసీ తీసుకునేటప్పుడు స్వచ్ఛందంగా మినహాయించదగిన మొత్తాన్ని చెల్లిస్తే తక్కువ ప్రీమియం చెల్లించే అవకాశాన్ని కంపెనీ మీకు అందించే అవకాశం ఉంటుంది. మీరు మీ సామర్థ్యాన్ని బట్టి స్వచ్ఛందంగా మినహాయించదగిన మొత్తాన్ని చెల్లించవచ్చు.
అవసరం లేని యాడ్-ఆన్‌లను అవైడ్ చేయండి:
మీ కారు కోసం బీమా పాలసీ తీసుకునేటప్పుడు.. మీ పాలసీకి యాడ్ ఆన్ కవర్లను యాడ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఆ సమయంలో మీరు ఎంచుకునే యాడ్ ఆన్ కవర్లను బట్టి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో జీరో డిప్రిసియేషన్ కవర్, టైర్ ప్రొటెక్ట్ కవర్, ఇంజిన్ ప్రొటెక్ట్ కవర్, గ్యారేజ్ క్యాష్ వంటివి ఉన్నాయి. నిజానికి మీరు ఎన్ని యాడ్-ఆన్ కవర్‌లను జోడిస్తే, మీ ప్రీమియం అంత ఖరీదైనదిగా మారుతుంది, కావున మీకు తప్పనిసరి అనుకున్నవి కాకుండా మిగిలినవి తొలగించుకోవచ్చు.
మైనర్ క్లెయిమ్స్ అవైడ్ చేయండి:
కారుకోసం ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చిన్న నష్టాల కోసం క్లెయిమ్ చేయడం మానుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న రిపేరీలకు ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉండదు. కావున ఆలాంటి వాటిని మీరే పరిష్కరించుకోవచ్చు. మీరు చిన్న చిన్న నష్టాలకు క్లెయిమ్ చేస్తే మీ నో క్లెయిమ్ బోనస్ కోల్పోవచ్చు, అది మాత్రమే కాకుండా తర్వాత ప్రీమియంపై తగ్గింపును కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది.
(ఇదీ చదవండి: ఉత్పత్తిలో కనివిని ఎరుగని రికార్డ్ - 70 లక్షల యూనిట్‌గా ఆ బైక్)
మీరు డ్రైవ్ చేసినంత ప్రీమియం చెల్లించండి (Pay As You Drive Car Insurance):
సాధారణంగా కార్లు ఉపయోగించే అందరూ ప్రతి రోజూ ఉపయోగించే అవకాశం ఉండదు. కాబట్టి మీరు కారుని ఎక్కువగా ఉపయోగించని సమయంలో ఎక్కువ ప్రీమియం చెల్లించడం మంచిది కాదు. ఎక్కువ ప్రీమియం పొందాలంటే ఎక్కువ ఉపయోగించాలి. ఈ పాలసీ ప్రకారం మీరు మీ కారుని ఎన్ని కిలోమీటర్లు డ్రైవ్ చేస్తారో దానికి తగిన ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
(ఇదీ చదవండి: కంప్యూటర్ వద్దనుకున్నారు.. వంకాయ సాగు మొదలెట్టాడు - ఇప్పుడు సంపాదన చూస్తే..)
పాలసీ ల్యాప్స్ అవైడ్ చేయండి:
కారు వినియోగదారుడు ఏదైనా ఒక వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు, దానిని చెల్లించడానికి ఒక నిర్దిష్ట గడువు ఉంటుంది. కావున ఆ గడువు లోపల మీరు తప్పకుండా పాలసీ చెల్లించాల్సి ఉంటుంది. మీ గడువు ముగిసేవరకు వేచి ఉండటం మంచిది కాదు, ఇది తప్పకుండా గుర్తుంచుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment