
ఎక్స్ఏఐ కొత్త వర్షన్ ‘గ్రోక్ 3(Grok 3)’ని ప్రారంభిస్తున్నట్లు కంపెనీ సీఈఓ ఎలాన్‌మస్క్(Elon Musk) ప్రకటించారు. ఎక్స్‌లో ఇంజినీర్ల సమక్షంలో ఏర్పాటు చేసిన లైవ్ స్ట్రీమ్ ప్రజెంటేషన్‌లో ఈ కొత్త జనరేటివ్ ఏఐ మోడల్‌ను మస్క్ ఆవిష్కరించారు. గ్రోక్ 3 ఇప్పటివరకు ఉన్న గ్రోక్ 2 కంటే 10 రెట్లు ఎక్కువ సామర్థ్యంతో పని చేస్తుందని మస్క్ పేర్కొన్నారు. గణితం, సైన్స్, కోడింగ్ వంటి వివిధ విభాగాల్లో మార్కెట్‌లో పోటీదారులుగా ఉన్న ఆల్ఫాబెట్ ఇంక్‌కు చెందిన గూగుల్ జెమిని, డీప్ సీక్- వీ 3 మోడల్, ఆంత్రోపిక్-క్లాడ్, ఓపెన్ఎఐ-జీపీటీ-4ఓ కంటే సమర్థంగా పని చేస్తుందని చెప్పారు.
ప్రెజెంటేషన్ సమయంలో మస్క్ గ్రోక్ 3 అధునాతన తార్కిక సామర్థ్యాలను, సంక్లిష్ట ప్రశ్నలను అర్థం చేసుకొని వాటికి ప్రతిస్పందించే విధానాలను హైలైట్ చేశారు. మెషిన్ లెర్నింగ్ పద్ధతులను ఉపయోగించి సింథటిక్ డేటాసెట్లపై ఈ మోడల్ శిక్షణ పొందినట్లు చెప్పారు. ఇది తప్పుడు సమాచారాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. గ్రోక్ 3 ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అత్యంత శక్తివంతమైన ఏఐ మోడళ్లలో ఒకటిగా మారిందని తెలిపారు.
ఇదీ చదవండి: అంతకంతకూ పెరుగుతున్న బంగారం ధర!
గ్రోక్ 3తోపాటు డీప్ సెర్చ్ అని పిలువబడే కొత్త స్మార్ట్ సెర్చ్ ఇంజిన్‌ను కూడా ఈ సందర్భంగా ప్రవేశపెట్టారు. ఇది వినియోగదారులకు మెరుగైన పరిశోధనలు అన్వేషించడానికి, డేటాను విశ్లేషించడానికి అనుమతిస్తుందని కంపెనీ తెలిపింది. గ్రోక్ 3 మోడల్ ఎక్స్ ప్లాట్‌ఫామ్ ప్రీమియం ప్లస్ చందాదారులకు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుందని పేర్కొంది. సూపర్ గ్రోక్ అని పిలువబడే కొత్త సబ్ స్క్రిప్షన్ ద్వారా ఇతరులకు దీని సేవలు అందిస్తున్నట్లు చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment