ట్విటర్‌పై ఎలన్‌మస్క్ పంచులు కొనసాగుతూనే ఉన్నాయి. భారీ ఆఫర్ అని ప్రకటిస్తూనే ట్విటర్ బోర్డుపై మానసిక దాడి కొనసాగిస్తున్నాడు ఎలన్ మస్క్. ట్విటర్‌ను ఏకమొత్తంగా కొనడానికి ఎలన్‌మస్క్ చేసిన భారీ ఆఫర్‌పై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గేరీ బ్లాక్ అనే ట్విటర్ యూజర్ స్పందిస్తూ ఒకవేళ ఎలన్ మస్క్ కనుక ట్విటర్‌ను కొనుగోలు చేసి ప్రైవేట్ ఆస్తిగా మారిస్తే.. బోర్డు సభ్యులు ఉద్యోగాలు కోల్పోతారు. వారికి నెలవారీగా ఇచ్చే జీతాలు సేవ్ అవుతాయంటూ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్‌కి ఎలన్ మస్క్ స్పందిస్తూ.. నా బిడ్‌కు అంగీకరిస్తే బోర్డుకు చెల్లించాల్సిన శాలరీ జీరో అవుతుంది. దీని వల్ల ఏడాదికి రెండు నుంచి మూడు మిలియన్ డాలర్ల సొమ్ము పొదుపు అవుతుంది అంటూ బదులిచ్చాడు. ఎలన్‌మస్క్ ఎత్తుగడలను అడ్డుకునేందుకు బోర్డు సభ్యులు సైతం వేగంగా పావులు కదుపుతున్నారు. అవసరం అయితే పాయిజన్ పిల్ మోడల్ అమలుకు రెడీ అవుతున్నారు.
Let me point out something obvious: If @elonmusk takes $TWTR private, the TWTR board members don’t have jobs any more, which pays them $250K-$300K per year for what is a nice part-time job. That could explain a lot. pic.twitter.com/vLgpEZpapA
— Gary Black (@garyblack00) April 17, 2022
చదవండి: ఎలన్‌మస్క్‌కి ట్విటర్ బోర్డ్ కౌంటర్.. తెరపైకి పాయిజన్ పిల్?
Comments
Please login to add a commentAdd a comment