తిరోగమన బాటలో ఫారెక్స్‌ నిల్వలు.. భారీగా తగ్గుదల | Forex reserves decline for the third week in row to 590. 59 billion Dollers | Sakshi
Sakshi News home page

Forex Reserves Of India: తిరోగమన బాటలో ఫారెక్స్‌ నిల్వలు.. భారీగా తగ్గుదల

Published Sat, Aug 13 2022 5:11 AM | Last Updated on Sat, Aug 13 2022 8:44 AM

Forex reserves decline for the third week in row to 590. 59 billion Dollers - Sakshi

ముంబై: భారత్‌ ఫారెక్స్‌ నిల్వలు తిరోగమన బాటన కొనసాగుతున్నాయి. ఆగస్టు 5వ తేదీతో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో పోల్చిచూస్తే, 897 మిలియన్‌ డాలర్లు తగ్గి, 572.978 బిలియన్‌ డాలర్లకు చేరాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తాజా గణాంకాలను వెల్లడించింది.

ఫారెక్స్‌ మార్కెట్‌లో అవసరాలకు సంబంధించి డాలర్ల లభ్యత తగిన విధంగా ఉండేలా చూడ్డం, ఎగుమతులకన్నా, దిగుమతులు పెరుగుదల, రూపాయి విలువ స్థిరీకరణకు చర్యలు వంటి అంశాలు ఫారెక్స్‌ నిల్వల తగ్గుదలకు కారణం అవుతోంది.  2021 సెప్టెంబర్‌ 3తో ముగిసిన వారంలో ఫారెక్స్‌ చరిత్రాత్మక రికార్డు 642 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అయితే అటు తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత నిల్వలు భారత్‌ దాదాపు 10 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. గణాంకాల ప్రకారం..
వేర్వేరు విభాగాల్లో...

► డాలర్‌ రూపంలో పేర్కొనే ఫారిన్‌ కరెన్సీ అసెట్స్‌ (ఎఫ్‌సీఏ) సమీక్షా వారంలో 1.611 బిలియన్‌ డాలర్లు తగ్గి 509.646 బిలియన్‌ డాలర్లకు చేరాయి.  
► సిడి నిల్వల విలువ 671 మిలియన్‌ డాలర్లు పెరిగి 40.313 బిలియన్‌ డాలర్లకు ఎగసింది.
► ఐఎంఎఫ్‌ స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ విలువ 46 మిలియన్‌ డాలర్లు పెరిగి 18.031 బిలియన్‌ డాలర్లకు చేరింది.
► ఐఎంఎఫ్‌ వద్ద నిల్వల స్థాయి  3 మిలియన్‌ డాలర్లు తగ్గి 4.987 బిలియన్‌ డాలర్లకు చేరాయి.  


ఆర్‌బీఐ గవర్నర్‌ భరోసా
ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, దిగుమతులు,  రుణ సేవల అవసరాలు, పోర్ట్‌ఫోలియో అవుట్‌ఫ్లోల కారణంగా డిమాండ్‌కు సంబంధించి ఫారెక్స్‌ మార్కెట్‌లో విదేశీ మారకపు సరఫరాలకు సంబంధించి వాస్తవంగా కొరత ఉందని అన్నారు. తగినంత విదేశీ మారక ద్రవ్య లభ్యత ఉండేలా సెంట్రల్‌ బ్యాంకు మార్కెట్‌కు అమెరికా డాలర్లను సరఫరా చేస్తోందని చెప్పారు. ‘‘మూలధన ప్రవాహం బలంగా ఉన్నప్పుడు మనం ఫారెక్స్‌ నిల్వలను భారీగా కూడబెట్టుకున్నాం. ఇప్పుడు ఈ ప్రయోజనాన్ని పొందుతున్నాం. వర్షం పడుతున్నప్పుడు ఉపయోగించేందుకు మీరు గొడుగును కొనుగోలు చేస్తారు’’ అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement