ముంబై: ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ పరికరాల తయారీ కోసం కొత్తగా అనుబంధ సంస్థను ఏర్పాటు చేసినట్లు కైనెటిక్ ఇంజినీరింగ్ వెల్లడించింది. కైనెటిక్ వాట్స్ అండ్ వోల్ట్స్ పేరుతో 2022లో దీన్ని నెలకొల్పినట్లు తెలిపింది. ఇది మోటార్లు, కంట్రోలర్లు, బ్యాటరీలు మొదలైనవి తయారు చేస్తుందని పేర్కొంది.
కొత్త కంపెనీలో మాతృ సంస్థకు 92 శాతం, ప్రమోటర్లయిన ఫిరోదియా కుటుంబానికి మిగతా 8 శాతం వాటాలు ఉంటాయి వ్యూహాత్మక/ఆర్థిక భాగస్వామికి 25 శాతం వరకు వాటాను విక్రయించేందుకు కూడా కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేఈఎల్, కైనెటిక్ కమ్యూనికేషన్స్ కింద ఉన్న తమ ప్రస్తుత ఈవీ (ఎలక్ట్రిక్ వాహనాలు) వ్యాపారాన్ని కొత్త సంస్థలో విలీనం చేయనున్నట్లు కైనెటిక్ ఇంజినీరింగ్ ఎండీ అజింక్యా ఫిరోదియా తెలిపారు.
తాము ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల కోసం గేర్‌బాక్సులు, ఛాసిస్‌లను తయారు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా 700 పైచిలుకు సంస్థలు ద్విచక్ర ఈవీలను ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో తమకు భారీగా వ్యాపార అవకాశాలు ఉన్నాయని ఆయన ఫిరోదియా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment