న్యూఢిల్లీ: వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాలు, పట్టణాలు వల్ల ప్రయోజనాలే కాదు కొన్ని సార్లు ఇబ్బందులూ ఎదురువుతుంటాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిందే ట్రాఫిక్ సమస్య. ఒక్కసారి రోడ్డుపైకి వెళ్తే ఈ రద్దీ కారణంగా తలనొప్పి రావాల్సిందే. సిగ్నల్స్ వద్ద గంటల తరబడి ఎదురుచూస్తు ప్రస్తుతం మనదేశంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఎంతలా అంటే ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఉన్న టాప్-10 నగరాల్లో మన దేశంలోనే 2 ఉండటం ఇందుకు ఉదాహరణ. తాజాగా లోకేషన్ టెక్నాలజీ స్పెషలిస్టు టామ్ టామ్ సంస్థ ట్రాఫిక్ ఇండెక్స్ గ్లోబల్ టాప్ 25 జాబితాను విడుదల చేసింది.
ఈ జాబితాలో ముంబై 5వ స్థానంలోను, బెంగళూరు 10వ స్థానంలో నిలిచాయి. ప్రపంచంలోని 58 దేశాలలోని అత్యంత రద్దీ గల 404 నగరాల్లో ఢిల్లీ 11వ స్థానంలో, పూణే 21వ స్థానంలో ఉన్నాయని టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ గ్లోబల్ టాప్ 25 జాబితా తెలిపింది. అయితే, 2021లో ఢిల్లీలో ట్రాఫిక్ రద్దీ స్థాయి 2019 కంటే 14% తక్కువగా ఉండగా, ముంబై (18%), బెంగళూరు(32%), పూణే 29% రద్దీ శాతం తగ్గిందని నివేదిక తెలిపింది. ఈ జాబితాలో ఇస్తాంబుల్ అగ్రస్థానంలో ఉండగా, మాస్కో రెండో స్థానంలో నిలిచింది. బుధవారం విడుదల చేసిన నివేదిక, 2021లో భారతదేశంలో ట్రాఫిక్ రద్దీ స్థాయి ప్రీ-కోవిడ్ సమయాల కంటే 23% తక్కువగా ఉందని, రద్దీ సమయాల్లో ప్రత్యేకంగా 31% తగ్గిందని తెలిపింది. 2020లో ముంబై, బెంగళూరు, ఢిల్లీ అనే మూడు నగరాలు ట్రాఫిక్ రద్దీ పరంగా టాప్ 10 జాబితాలో నిలిచాయి.
(చదవండి: దేశంలోని తొలి బుల్లెట్ రైలు స్టేషన్ అదిరిపోయిందిగా..!)
Comments
Please login to add a commentAdd a comment