న్యూఢిల్లీ: గ్లోబల్ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ (వీసీలు) భారత్‌లోని చిన్న పట్టణాల్లో (ద్వితీయ, తృతీయ శ్రేణి) స్టార్టప్‌లకు నిధుల చేయూతనివ్వాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. గ్లోబల్ వీసీలతో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. స్టార్టప్‌లకు మద్దతుగా తమ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకుందని, భవిష్యత్తులోనూ తీసుకుంటుందని భరోసా కల్పించారు. పెట్టుబడులు పెట్టేందుకు కొత్త రంగాలను గుర్తించాలని సూచించారు.
‘‘భారత యువ వ్యాపారవేత్తలు పొందిన మేధో సంపత్తి హక్కులను కాపాడాలి. ప్రోత్సహించేందుకు ముందుకు రావాలి. వారికి మీ అనుభవం అందించడం ద్వారా మరింత విస్తరించేందుకు, మరిన్ని పెట్టుబడులతో సహకారాన్ని విస్తృతం చేయాలి’’ అని వీసీలను కోరారు. స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో వ్యాపార నిర్వహణ, నిధుల సమీకరణను సులభతరం చేసేందుకు 49 నియంత్రణ సంస్కరణలను అమలు చేసినట్టు మంత్రి చెప్పారు. నిబంధనల అమలు భారాన్ని తగ్గించినట్టు పేర్కొన్నారు. మంత్రి నిర్వహించిన స్టార్టప్‌ల సమావేశంలో అమెరికా, జపాన్, కొరియా, సింగపూర్ తదితర దేశాల నుంచి 75కు పైగా వీసీ ఫండ్స్ ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. వీటి నిర్వహణలో ప్రపంచవ్యాప్తంగా 30 బిలియన్ డాలర్ల నిధులున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment