
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయానికి సెన్సెక్స్ 395 పాయింట్లు లాభంతో 63544 వద్ద నిఫ్టీ 117 పాయింట్ల లాబాంతో 18974 వద్ద ట్రేడ్ అవుతుంది.
ఇన్ఫోసిస్, అపోలో హాస్పిటల్స్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, గ్రాసిమ్,హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఏసియన్ పెయింట్స్, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
సెప్టెంబర్ త్రైమాసికంలో టెక్ కంపెనీల కార్పొరేట్ ఫలితాలు అమెరికా మదుపర్లను నిరాశపర్చాయి. దాంతో అక్కడి మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. మరోవైపు గత త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిరేటును నమోదు చేసింది. దీంతో ఫెడరల్ రిజర్వ్ అంచనాల కంటే సుదీర్ఘకాలం వడ్డీరేట్లను గరిష్ఠ స్థాయిలో ఉంచే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఐరోపా మార్కెట్లు సైతం నష్టాల్లోనే పయనించాయి. ఆసియా- పసిఫిక్ సూచీలు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ బ్యారెల్ చమురు ధర 0.5 శాతం పెరిగి రూ.88.83 డాలర్లకు చేరింది.