ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం (Paytm)కి చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) భారీ షాకిచ్చింది. కస్టమర్ల నుంచి డిపాజిట్లు తీసుకోకుండా నిషేధించింది. ఫిబ్రవరి 29 తర్వాత నుంచి కస్టమర్ అకౌంట్లు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌ల వంటి వాటి ద్వారా డిపాజిట్లు, టాప్-అప్‌లను స్వీకరించకూడదని ఆదేశించింది.
బయటి ఆడిటర్లు నిర్వహించిన సమగ్ర సిస్టమ్ ఆడిట్ నివేదిక, తదుపరి సమ్మతి ధ్రువీకరణ నివేదికకు ప్రతిస్పందనగా పేటీఎంపై సెంట్రల్ బ్యాంక్ ఈ చర్య తీసుకుంది. ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ అకౌంట్లు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, ఎస్‌సీఎంసీ కార్డ్‌లు మొదలైన వాటిలో వడ్డీ, క్యాష్‌బ్యాక్‌లు, రీఫండ్‌లు తప్ప డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు, టాప్-అప్‌లు అనుమతించబడవని స్పష్టం చేసింది.
తమ నోడల్ ఖాతాలను వీలైనంత త్వరగా ఫిబ్రవరి 29లోపు రద్దు చేసుకోవాలని One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్, పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్‌లను ఆర్బీఐ ఆదేశించింది. అలాగే అన్ని లావాదేవీలు, నోడల్ ఖాతాల సెటిల్‌మెంట్‌ను మార్చి 15 నాటికి పూర్తి చేయాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment