భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కంపెనీలపై ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. ఆయా బెట్టింగ్ సంస్థల వల్ల ప్రభుత్వానికి 2.5 బిలియన్ డాలర్లు(రూ.20వేలకోట్లు) నష్టం కలుగుతోందని అఖిల భారత గేమింగ్ సమాఖ్య (ఏఐజీఎఫ్) తెలియజేసింది.
విదేశీ కంపెనీలు భారత్‌లో తమ సంస్థలకు చెందిన ప్లాట్‌ఫామ్‌ల్లో చట్టవ్యతిరేక బెట్టింగ్, గ్యాంబ్లింగ్ గేమ్‌లను అందిస్తున్నాయి. అయితే వాటికి చట్టబద్ధత లేకపోవడంతో చాపకింద నీరులా అవి విస్తరిస్తున్నాయి. ఆ కంపెనీలకు చెందిన ప్లాట్‌ఫామ్‌లు వినియోగిస్తున్న వారు చట్టబద్ధత ఉన్నావాటికి లేని వాటిని మధ్య తేడాను గ్రహించలేకపోతున్నారని ఏఐజీఎఫ్ సీఈఓ రోలండ్ లాండర్స్ తెలిపారు.
ఇలా విదేశీ కంపెనీలు భారత్‌లోని చట్టబద్ధ గేమింగ్ పరిశ్రమకు హాని కలిగించడంతో పాటు వినియోగదార్లకు నష్టం కలిగేంచేలా వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ ఆఫ్‌షోర్ ప్లాట్‌ఫామ్స్ ఏటా 12 బిలియన్ డాలర్ల (సుమారు రూ.లక్ష కోట్ల) వరకు యూజర్లు, ప్రకటన కంపెనీల నుంచి డిపాజిట్లను వసూలు చేస్తున్నాయి. అంటే జీఎస్‌టీ రూపంలో 2.5 బిలియన్ డాలర్ల(రూ.20వేల కోట్లు) మేర కేంద్రానికి నష్టం జరుగుతోందని చెప్పారు. ఇలాంటి కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందన్నారు. చాలా సంస్థలు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో వ్యాపార ప్రకటనలు పెంచాయి. తమ ప్లాట్‌ఫారాలపై జీఎస్‌టీ/ టీడీఎస్ వర్తించదనీ చెబుతున్నాయన్నారు. దాంతో ఆయా గేమింగ్ ప్లాట్‌ఫారాల్లో ప్రకటనలకోసం కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి: గూగుల్‌లో నిరసన సెగ..రూ.10వేలకోట్ల ప్రాజెక్ట్ నిలిపేయాలని డిమాండ్..
Comments
Please login to add a commentAdd a comment