చాలామంది ఉద్యోగులు.. కంపెనీ రూల్స్ ప్రకారం ఆఫీసులకు వచ్చామా.. ఏదో పని చేసి వెళ్లిపోయామా అన్నట్టు ఉంటారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి, అలాంటి కాలక్షేపాలకు సంస్థలు చరమగీతం పాడుతున్నాయి. దీంతో కొత్త రూల్స్ పుట్టుకొచ్చాయి.
ఆఫీసుకు సమయానికి వస్తే సరిపోదు, ఉన్నంత సేపు ఎంత క్వాలిటీ వర్క్ చేసావు అనేది ప్రధానమని 10 సంస్థల్లో 7 చెబుతున్నట్లు.. ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ 'అప్నా.కామ్' అధ్యయనంలో వెల్లడించింది. యాజమాన్యం మెప్పు కోసం, గుర్తింపు కోసం మాత్రం కాకుండా చేస్తున్న పనిలో ఎంత వరకు నాణ్యత ఉందనేది ఇక్కడ ప్రధానమని స్పష్టమవుతోంది.
సమయానికి ఆఫీసులకు వచ్చి పనిచేయకపోతే ఎవరికీ లాభం ఉండదు. కాబట్టి సంస్థలో కొంత వెనుకబడిన వారిని గుర్తించి వారికి శిక్షణ ఇప్పంచడం లేదా వారి పనిలో నాణ్యతను పెంచడానికి కావలసిన సదుపాయాలను అందించడం వంటికి సంస్థలు చేపట్టాయి. ఉద్యోగి నుంచి ఏమి రాబట్టుకోవాలనేది సంస్థకు తెలిసి ఉండటం ప్రధానమని అప్నా.కామ్ సర్వే ద్వారా తెలుసుకున్నట్లు వెల్లడించింది.
కంపెనీలు తమ ఉద్యోగులను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ.. పని చేసిన వారికి మంచి ప్రోత్సాహాలను అందిస్తే.. తప్పకుండా మరింత అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని 77 శాతం యాజమాన్యాలు చెబుతున్నాయి.
ఇదీ చదవండి: 'హనూమన్' ఏఐ గురించి ఆసక్తికర విషయాలు..
రోజూ సమయానికి ఆఫీసులకు వచ్చి, విరామం తీసుకోకుండా, సెలవులు పెట్టకుండా పనిచేయాలనే సంస్థలు మంచి ఫలితాలను పొందవని, దీనికి భిన్నమైన సంస్కృతిని పెంపొందించడానికి సంస్థలకు కూడా పాటుపడాలని సర్వేలో తెలుసుకున్నట్లు అప్నా కో ఫౌండర్ అండ్ సీఈఓ సీఈవో నిర్మిత్ పరీఖ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment