
ప్రపంచంలోనే అపర కుబేరుల జాబితాలో 10స్థానంలో ముఖేష్ అంబానీ భవిష్యత్‌ను ముందే ఊహిస్తున్నారు. లాభాలు తెచ్చిపెట్టే టెక్నాలజీపై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటికే రెన్యూవబుల్ ఎనర్జీ పై భారీగా పెట్టుబడులు పెట్టిన ఆయన తాజాగా అమెరికాకు చెందిన సన్మీనా కంపెనీలో రూ.1670కోట్లు పెట్టుబడులు పెట్టారు.
అమెరికా కేంద్రంగా సన్మీనా 40ఏళ్లుగా ఎలక్ట్రానిక్స్ మ్యానిఫ్యాక్చరింగ్ సర్వీస్‌లను అందిస్తుంది. ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టి సుమారు 50.1శాతం స్టేక్‌ను సొంతం చేసుకున్నారు. ఈ పెట్టుబడులతో భారత్ కేంద్రంగా హై టెక్నాలజీ మ్యానఫ్యాక్చరింగ్ విభాగంలో డిజిటల్ ఎకానమినీ వృద్ది సాధించొచ్చని రిలయన్స్ జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ అన్నారు.
100 ఎకరాల్లో సన్మీనా క్యాంపస్
సన్మీనాలో పెట్టిన పెట్టుబడుల్ని భారత్‌లో టెలికాం, ఐటీ, డేటా సెంటర్స్, క్లౌడ్, 5జీ, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాలకు చెందిన ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్‌లను తయారు చేయాలని భావిస్తుంది. రిలయన్స్ సమాచారం ప్రకారం.. భారత్‌లో చెన్నై కేంద్రంగా సన్మీనా కార్యకలాపాల్ని ప్రారంభించనుంది. ఇందుకోసం 100ఎకరాల్లో క్యాంపస్ నిర్మాణాలు చేపట్టనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. దీంతో పాటు భారత్‌లో మిగిలిన ప్రాంతాల్లో మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లను విస్తరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment