
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ఉత్సాహంగా ప్రారంభమైనాయి. గ్లోబల్ మార్కెట్ మిశ్రమ సంకేతాల మధ్య సెన్సెక్స్ 235 పాయింట్లు ఎగిసింది. నిఫ్టీ కూడా 15,753 స్థాయికి చేరుకుంది. కానీ అంతలోనే లాభాలన్నీ తుడిచిపెట్టుక పోయాయి. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో సెన్సెక్స్ 162 పాయింట్లు క్షీణించి 52161 వద్ద, నిఫ్టీ 69 పాయింట్లు నష్టంతో 15 622 వద్ద కొనసాగుతోంది. బజాజ్ ఫిన్‌సర్వ్ 2 శాతం లాభ పడగా, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, టిసిఎస్, హెచ్‌సిఎల్ టెక్ లాభాల్లో ఉన్నాయి. ఓఎన్‌జిసి, ఎం అండ్ ఎం, హెచ్‌డిఎఫ్‌సీ ట్విన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ నష్టాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment