
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసాయి.వారం ఆరంభం రోజు సోమవారం జోరుమీదున్న దేశీయ మార్కెట్లు ఆ తరువాత భారీ ఒడి దుడుకులకు లోనయ్యాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడిన మార్కెట్లలో ఆఖరి అర్థగంటలో మరింత అమ్మకాల వెల్లువ కురిసింది. దీంతో సెన్సెక్స్ చివరికి సెన్సెక్స్ 531 పాయింట్ల నష్టంతో 48347 వద్ద 49వేల దిగువకు చేరింది. నిఫ్టీ 133 పాయింట్లు పతనమై 14239 వద్ద 14వేల 300 స్థాయిని కోల్పోయింది. బ్యాంకింగ్ మినహా మిగిలిన సూచీలన్నీ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.
ముఖ్యంగా హెవీవెయిట్ షేరురిలయన్స్ 5 శాతం పతనంకావడంమార్కెట్లను దెబ్బతీసింది. టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్ భారీగా నష్టపోయాయి. అలాగే క్యూ3 లో నికర లాభాలు 16 శాతం ఎగిసినట్టు ప్రకటించిన కోటక్ మహీంద్ర కూడా నష్టపోయింది. మరోవైపు గ్రాసిం, హెచ్‌యూఎల్ లాభపడ్డాయి.
టీసీఎస్ ఘనత
భారతీయ సాఫ్ట్‌వేర్ సేవలసంస‍్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) అరుదైన ఘనతను సాదించింది. సోమవారం (జనవరి 25) నయాక్సెంచర్‌ను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన ఐటీ కంపెనీగా అవతరించింది. టీసీఎస్ మార్కెట్ విలువ సోమవారం ఉదయం 169.9 బిలియన్ డాలర్లను దాటింది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో యాక్సెంచర్ మార్కెట్ క్యాప్ 168 బిలియన్ డాలర్లు.