భారతీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. యూఎస్ మార్కెట్ల బలంతో బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్‌ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 లాభాలతో మొదలుపెట్టాయి.
ప్రారంభ సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 250 పాయింట్లు లేదా 0.31 శాతం పెరిగి 79,746 వద్ద, నిఫ్టీ 84.5 పాయింట్లు లేదా 0.35 శాతం పెరిగి 24,225 వద్ద చలిస్తున్నాయి.
డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారతీయ స్టాక్స్‌ను విక్రయించడం, యూఎస్ కొనుగోలు చేస్తుండటం, సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీయ సంస్థల పనితీరు పెట్టుబడిదారులకు ఆందోళన కలిగించే అంశాలుగా ఉన్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment