దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ 171 పాయింట్లు తగ్గి 24,244కు చేరింది. సెన్సెక్స్ 525 పాయింట్లు నష్టపోయి 79,613 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 104.12 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 81.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.28 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 2.31 శాతం, నాస్‌డాక్ 3.64 శాతం నష్టపోయాయి.
వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ స్టాక్ మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. దాంతో బుధవారం నష్టాల్లోకి చేరుకుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెక్యూరిటీలపై ఎస్‌టీటీ, స్వల్పకాలిక మూలధన రాబడి(ఎస్‌టీసీజీ), ధీర్ఘ కాలిక మూలధన రాబడి(ఎల్‌టీసీజీ)లపై పన్నుల పెంపు ప్రతిపాదనలు ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి. దాంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment