దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం జీవితకాల గరిష్ఠాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 160 పాయింట్లు పెరిగి 25,543కు చేరింది. సెన్సెక్స్ 577 పాయింట్లు లాభపడి 83,523 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 100.37 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.73 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.29 శాతం, నాస్‌డాక్ 0.31 శాతం నష్టపోయాయి.
ఇదీ చదవండి: ఆర్‌బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందా..?
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నాలుగేళ్ల తర్వాత తొలిసారి వడ్డీ రేట్ల తగ్గింపు బాట పట్టింది. అత్యధిక శాతం విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా వడ్డీ రేటులో ఏకంగా 0.5 శాతం కోత పెట్టింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 4.75–5 శాతానికి దిగివచ్చాయి. ఇప్పటివరకూ 5.25–5.5 శాతంగా అమలవుతున్నాయి. ఆగస్టులో వ్యవసాయేతర ఉద్యోగాలు అంచనాలకంటే తక్కువగా 1,42,000కు పరిమితంకాగా.. రిటైల్ ధరలు 0.3 శాతం బలపడి 3.2 శాతాన్ని తాకాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతున్న సంకేతాలు అందినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. భారత్‌లో ఆహార ద్రవ్యోల్బణం విషయంలో అనిశ్చితి నెలకొన్నందున ఆర్‌బీఐ ఈ ఏడాది వడ్డీ రేట్ల కోతను చేపట్టకపోవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment