మార్కెట్‌లో అ‍‍స్థిరత.. చివరకు లాభాలతో ముగింపు | Today Share Market Updates | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లో అ‍‍స్థిరత.. చివరకు లాభాలతో ముగింపు

Published Mon, Aug 9 2021 3:45 PM | Last Updated on Mon, Aug 9 2021 4:00 PM

Today Share Market Updates - Sakshi

ముంబై: ఈ వారం స్టాక్‌ మార్కెట్‌ లాభాలతో ప్రారంభమైంది. ఉదయం నుంచే దేశీ సూచీలు లాభాల బాటలో పయణించాయి. మధ్యలో కొంత వరకు ఊగిసలాడినా చివరకు లాభాలతోనే ఈ రోజు మార్కెట్‌ ముగిసింది. 

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఈ రోజు ఉదయం 54,385 పాయింట్ల వద్ద ట్రేడ్‌ మొదలైంది. మొదటి గంటలోనే దాదాపు 250 పాయింట్లు లాభపడింది. ఓ దశలో గరిష్టంగా  54,584 పాయింట్లను టచ్‌ చేసింది. ఆ తర్వాత ఒక్కసారిగా ఇన్వెస్టర్లు అమ్మకాలు మొదలుపెట్టడంతో మళ్లీ పాయింట్లు కోల్పోవడం మొదలైంది. మార్కెట్‌ ముగిసే సమయానికి 125 పాయింట్ల లాభంతో 54,402 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ ఈ రోజంతా ఒడిదుడుకులకు లోనైంది. మార్కెట్‌ ప్రారంభమైన తర్వాత లాభాల బాటలో పయణిస్తూ ఓ దశలో గరిష్టంగా 16,320 పాయింట్లను టచ్‌ చేసింది. ఆ తర్వాత నష్టపోతూ కనిష్టంగా 16,203 పాయింట్లను తాకింది. మరికొద్ది సేపట్లో మార్కెట్‌ ముగుస్తుందనగా కోలుకుని 20 పాయింట్ల లాభంతో 16,258 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement