
ఈ రోజు (బుధవారం) ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 434.34 పాయింట్ల నష్టంతో 72623.09 పాయింట్ల వద్ద, నిఫ్టీ 142 పాయింట్ల నష్టంతో 22055.00 పాయింట్ల వద్దకు చేరాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), జిందాల్ స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్, పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ మొదలైన కంపెనీలు చేరాయి.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), కోల్ ఇండియా, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), హీరోమోటోకార్ప్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, వోడాఫోన్ ఐడియా లిమిటెడ్, GMR ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment