పెళ్లికొడుకు వాచ్‌పై కన్నేసిన జూకర్‌బర్గ్‌ దంపతులు.. ధర ఎంతో తెలుసా.. | Zuckerberg And His Wife Going Surprise Over Anant Watch | Sakshi
Sakshi News home page

పెళ్లికొడుకు వాచ్‌పై కన్నేసిన జూకర్‌బర్గ్‌ దంపతులు.. ధర ఎంతో తెలుసా..

Mar 8 2024 3:30 PM | Updated on Mar 8 2024 4:11 PM

Zuckerberg And His Wife Going Surprise Over Anant Watch - Sakshi

అంబానీ ఇంట వివాహ వేడుకలు ఇటీవలే ముగిశాయి. అనంత్‌ అంబానీ-రాధికమర్చంట్‌ ప్రివెడ్డింగ్‌ ఈవెంట్‌ ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రముఖులు, సినీతారలు, ప్రపంచ వ్యాపారవేత్తలు పాల్గొని అలరించిన సంగతి తెలిసిందే.

అయితే ప్రివెడ్డింగ్‌ వేడుకలు ముగిసినా అందుకు సంబంధించిన వార్తలు రోజూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉన్నాయి. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌కి హాజరైన వారిలో ఫేస్‌బుక్ అధినేత మార్క్‌జూకర్‌బర్గ్‌ దంపతులు కూడా ఉన్నారు. పెళ్లికొడుకు ధరించిన వాచ్‌ చూసి వారు దాని వివరాలు అడిగి తెలుసుకుంటున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. 

అనంత్ అంబానీ చేతి గడియారాన్ని గమనించిన మార్క్‌ భార్య ప్రిస్కిల్లా.. అది చాలా బాగుంది అని అనంత్‌కు కితాబిచ్చినట్లు తెలిసింది. దానికి జుకర్‌బర్గ్ అంగీకరిస్తూ తాను ఇప్పుటికే ఆ విషయాన్ని అనంత్‌కు చెప్పానని జవాబిచ్చారు. దాన్ని ఎవరు తయారు చేశారని ఆమె అడగ్గా.. రిచర్డ్ మిల్లే అని అనంత్‌ బదులిచ్చాడు. 

ఈ వీడియో వైరల్ అయిన వెంటనే పలువురు ఆ వాచ్ ధర, కంపెనీ గురించి సోషల్ మీడియాలో ఆరా తీయడం ప్రారంభించారు. దాని ఖరీదు రూ.15 కోట్లు ఉంటుందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఎక్స్‌లోని ఒక పోస్ట్ ప్రకారం.. ఆ రిచర్డ్ మిల్లే ఆర్‌ఎం 56-02 వాచ్ విలువ రూ.15-18 కోట్లు ఉంటుందని అంచనా. అనంత్‌కు పటెక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్ స్కై మూన్ టూర్‌బిల్లాన్ కూడా ఉంది. దీని ధర రూ.63 కోట్లుగా ఉందని తెలిసింది.

ఇదీ చదవండి: అమృత‘మూర్తి’కి అరుదైన గౌరవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement