సీఎం హోదాలో నాడు పలమనేరుకు వరాలజల్లు కురిపించిన చంద్రబాబు
రాష్ట్రంలోనే పలమనేరును ఆదర్శవంతంగా చేస్తానని హామీ
మహిళా డిగ్రీ కళాశాల వెంటనే మంజూరు చేసేస్తామని డాబు
నేడు పలమనేరులో సీట్ కార్నర్ మీటింగ్‌కు చంద్రబాబు
గతంలో ఇచ్చిన వాటికే దిక్కులేదు.. ఇప్పుడు మళ్లీ కొత్తవి నెరవేరుస్తారా ? అంటున్న జనం
పలమనేరు: 2014లో పొలం పిలుస్తోంది కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరైనప్పుడు పలమనేరుకు ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. వచ్చే ఎన్నికల కోసం నేడు ఆయన పలమనేరు పట్టణానికి విచ్చేస్తున్నారు. దీంతో గతంలో ఇచ్చిన హామీలనే పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడొచ్చి ఇంటింటికీ కేజీ బంగారు ఇస్తామన్నా ఎవరు నమ్మతారబ్బా అని జనం అనుకుంటున్నారు. గత టీడీపీ పాలనలో పొలం పిలుస్తోంది కార్యక్రమానికి విచ్చేసిన సీఎం హోదాలో విచ్చేసిన చంద్రబాబు ఈ ప్రాంతానికి పలు వరాలను గుప్పించారు. పట్టణంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు రామ్మూర్తి అనే దాత రూ.కోటి విరాళం ఇచ్చేందుకు ముందుకు రావడంతో తాను తప్పకుండా కళాశాల ఏర్పాటుకు ఆదేశాలను ఇస్తానని చెప్పారు.
అంతేకాక ఈ కళాశాలను మోడల్‌గా చేసి రాష్ట్రానికే ఆదర్శంగా నిలుపుతామన్నారు. ఇక ప్రాంతంలోని పట్టురైతుల కష్టాలను తీర్చేందుకు కేంద్రంతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామన్నారు. చైనా నుంచి పట్టు ఉత్పత్తులు అధికం కావడంతో స్థానికంగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయని ఇందుకోసం రైతులకు ఇన్సెంటివ్‌ను పెంచేలా చూస్తామన్నారు. పలమనేరు అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తయారు చేస్తా అన్నారు. కానీ ఇవేమీ ఆయన పాలనలో జరగనేలేదు. అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలోనే ఇచ్చిన హామీలను వెరవేర్చని ఆయన మళ్లీ ఇప్పుడు ఎన్నికల కోసం ఇచ్చే హామీలను అమలు చేస్తాడని ఎవరైనా నమ్ముతారా అని టీ కొట్లు వద్ద జనం చర్చించుకోవడం కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment