వినియోగించుకుంటే వజ్రాయుధమే | - | Sakshi
Sakshi News home page

వినియోగించుకుంటే వజ్రాయుధమే

Published Sat, Mar 15 2025 12:41 AM | Last Updated on Sat, Mar 15 2025 12:41 AM

వినియోగించుకుంటే వజ్రాయుధమే

వినియోగించుకుంటే వజ్రాయుధమే

వస్తు రూపంలోనో.. సేవల రూపంలోనో మనిషి మోసపోతూనే ఉంటాడు. ఇలాంటి పరిస్థితిలో వినియోగదారుడికి అండగా నిలుస్తుంది వినియోగదారుల ఫోరమ్‌. ఈ ఫోరం మెట్లు ఒక్కసారి ఎక్కితే కొనుగోలుదారుడికి తప్పక న్యాయం జరుగుతుంది. దీన్ని వినియోగించుకుంటే వజ్రాయుధంగా పనిచేస్తుంది.

చిత్తూరు అర్బన్‌: కొన్న వస్తువు నాణ్యత లేకపోయినా.. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి రూ.వేలల్లో బిల్లు చెల్లిస్తే సరిగా పట్టించుకోకపోయినా.. హోటల్‌లో రూ.40 వెచ్చించి తిన్న ఇడ్లీ బాగలేపోయినా.. ఓ సామాన్యుడి కడుపు మండిపోతుంది. ఎందుకంటే రూపాయి సంపాదించడానికి అతడు పడే కష్టం అలాంటిది. అలాంటి సామాన్యుడికి రక్షణ కల్పించడానికి అండగా నిలుస్తుంది వినియోగదారుల కమిషన్‌. అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వినియోగదారుల కమిషన్‌ పనితీరుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వినియోగదారుల కమిషన్‌ పనితీరుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

తప్పనిసరి న్యాయం

వాస్తవానికి లోపరహిత వస్తుసేవలు పొందడం అందరి హక్కు. చాలా సంస్థలు నైతికతకు నీళ్లొదిలి నాసిరకం వస్తువులు, సరకులు, సేవలను అంటగడుతున్నాయి. తద్వారా వినియోగదారుల ప్రయోజనాలను అవి తుంగలో తొక్కుతున్నాయి. ఈ క్రమంలో ఒక వ్యక్తి కొన్న వస్తువు సరిగ్గా పనిచేయకపోయినా, పొందిన సేవలో లోపం ఉన్నా ఆ వ్యక్తి వినియోగదారుల కమిషన్‌ మెట్లెక్కవచ్చు. ఒక్కసారి కమిషన్‌లో తనకు జరిగిన మోసంపై తగిన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే తప్పకుండా న్యాయం జరుగుతుంది. వినియోగదారుడిని రక్షించడంతో పాటు మోసపోయిన వారికి న్యా యం చేయాలనే లక్ష్యంతో ఏర్పాటయ్యిందే ‘జిల్లా వినియోగదారుల కమిషన్‌’. వినియోగదారుల కమిషన్‌ ఎలా పనిచేస్తుందంటే..!

చట్టంలో ఇలా..!

1986లో భారత ప్రభుత్వం వినియోగదారుల రక్షణ కోసం ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. అదే వినియోగదారుల పరిరక్షణ చట్టం. ఈ చట్టాన్ని అమలుచేయడానికి ‘రీడ్రసల్‌ ఫోరమ్స్‌’ను ఏర్పాటు చేశా రు. మోసపోయిన వ్యక్తికి సగటు న్యాయం తప్పనిసరిగా సకాలంలో అందించాలన్నదే ఈ చట్టం లక్ష్యం. ఆర్టీసీ, రైల్వే, తపాలాశాఖ, బీఎస్‌ఎన్‌ఎల్‌ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు డబ్బులు కట్టించుకుని సేవలు అందించే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు ఎవరు మోసం చేసినా కమిషన్‌ తలుపుకొట్టి న్యాయం పొందొచ్చు. జిల్లా స్థాయిలో వినియోగదారుల ఫోరంగా ఉన్న బెంచ్‌ను 2020 జూ లైలో వినియోగదారుల కమిషన్‌గా మార్చారు. కమిషన్‌లో వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదు లను పరిష్కరించడానికి ఓ అధ్యక్షులతోపాటు ఇద్దరు సభ్యులుగా ఉంటారు. మనం నిత్యం న్యాయస్థానాల్లో జరిగే వాదనలు, ప్రతివాదనలు లాగే ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత కమిషన్‌ తీర్పును వెలువరుస్తుంది.

తెల్ల కాగితంపై ఫిర్యాదు..

మనకు జరిగిన అన్యాయంపై కమిషన్‌ ఎదుట మన తరపు వాదనను మనమే స్వీయంగా వినిపించుకోవచ్చు. న్యాయవాది అవసరం తప్పనిసరికాదు. కమిషన్‌లో ఫిర్యాదు చేసే ముందు సేవాలోపం, కొన్న వస్తువుకు సంబంధించిన బిల్లు తప్పనిసరి. ఓ తెల్లకాగితంలో తాను మోసపోయిన విధానాన్ని రాసి, సంతకం చేసి కమిషన్‌కు ఇస్తే.. ప్రతివాదికి నోటీసులు పంపిస్తారు. 90 రోజుల్లో మన కేసును పరిష్కరించాలని చట్టంలోనే రూపొందించారు. జిల్లా స్థాయిలో ఇచ్చిన తీర్పుపై సంతృప్తి చెందకుంటే రాష్ట్ర, జాతీయ స్థాయిలోని కమిషన్‌ను ఆశ్రయించే వెలుసుబాటు ఉంది. చిత్తూరులోని వినియోగదారుల కమిషన్‌ కార్యాలయంలో ఫోన్‌–08572235577 నెంబరుకు సంప్రదించి ఫిర్యాదులపై సహాయం తీసుకోవచ్చు.

అవగాహనే తొలి అస్త్రం.. ఆపై చట్టం

మోసపోయిన వాళ్లకు అండగా కమిషన్‌

ఆశ్రయిస్తే ఉచిత న్యాయసేవ.. పరిహారం

నేడు అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం

ఎవరు వినియోగదారులు..?

వినియోగదారుల హక్కుల చట్టం 1986 ప్రకారం తమ అవసరాల కోసం వస్తువులు కొనేవాళ్లు, సేవలు పొందే ప్రతీ ఒక్కరూ వినియోగదారుడే. కొనుగోలుదారుల అనుమతితో ఏదైనా వస్తువును, సేవలను ఉపయోగించుకునే వాళ్లు కూడా వినియోగదారులే. అంటే సమాజంలోని ప్రతీ ఒక్క వ్యక్తి ఏదో ఒకరూపంలో వినియోగదారులే అవుతారు.

గెలిచిన ధీరులు

చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లెకు చెందిన శ్రీదేవి అనే గృహిణి ఓ రిఫ్రిజిరేటర్‌ను రూ.11 వేలు వెచ్చించి కొన్నారు. ఆర్నెళ్ల తరువాత ఫ్రిడ్జి తలుపు తుప్పు పట్టడం ప్రారంభించింది. దుకాణ యజమా నికి చెబితే పట్టించుకోలేదు. తీరా కమిషన్‌లో ఫిర్యాదు చేస్తే తగిన బిల్లులు, ఫ్రిడ్జి చూసిన కమిషన్‌ ఆ మహిళకు కొత్త రిఫ్రిజిరేటర్‌ ఇవ్వడంతో పాటు కోర్టు ఖర్చులకు రూ.3 వేలు, ఆమె పడిన మానసిక వేదనకు రూ. 10 వేలు పరిహారం ఇవ్వాలని కమిషన్‌ ఆదేశించింది.

పశువుల కొనుగోలు సమయంలో బీమా చేస్తే, అవి మృత్యువాత పడితే పరిహారం ఇవ్వలేదని పలమనేరుకు చెందిన వెంకటముని అనే వ్యక్తి కమిషన్‌లో కేసు వేశారు. మృతి చెందిన రెండు ఆవులకు రూ.1.20 లక్షల బీమా, కోర్టు ఖర్చులకు రూ.5 వేలు, వెంకటముని పడిన బాధకు రూ.5 వేలు పరిహారం ఇవ్వా లని కమిషన్‌ ఇచ్చిన తీర్పు బీమా కంపెనీల్లో బాధ్యతను పెంచినట్లయ్యింది.

నాసిరకం హెల్మెట్‌ విక్రయించినందుకు రూ.10 వేల పరిహారం ఇవ్వాలనే కమిషన్‌ తీర్పును అమలుచేయనందుకు కుప్పం పట్టణానికి చెందిన శివ య్య మళ్లీ కమిషన్‌ తలుపు తట్టాడు. తీర్పు అమలు చేయని చిత్తూరులోని డీలర్‌కు, బెంగళూరులోని కంపెనీదారుడి అరెస్టు వారెంటు జారీ చే యడంతో వినియోగదారుడి పరిహారం ఇచ్చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement