పారదర్శకంగా ఓటరు జాబితా
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో పారదర్శకంగా ఓటరు జాబితా రూపొందించేలా చర్యలు చేపడతున్నటుల డీఆర్‌ఓ మోహన్‌కుమార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. డీఆర్‌ఓ మాట్లాడుతూ ఓటరు జాబితా కసరత్తుకు రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. ఈ క్రమంలోనే ఎపిక్ కార్డులను ఆధార్‌కు అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిబంధనలు, చట్టాల్లో అవసరమైన మార్పు చేర్పులకు రాజకీయ పార్టీల నుంచి సూచనలు స్వీకరిస్తున్నామన్నారు. ఓటరు నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. అలాగే నోటీసు ఇచ్చిన తర్వాతే మృతి చెందిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. రెండు నియోజకవర్గాలలో ఓటు హక్కు కలిగి ఉన్నవారిని గుర్తించి, వెంటనే తొలగించాలని బీఎల్‌ఓలకు ఆదేశాలిచ్చినట్లు వివరించారు. పోలింగ్ స్టేషన్‌ల రేషనలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. జిల్లాలో ఫారం 6,7,8 సంబంధించి 8,268 దరఖాస్తులు నమోదు కాగా 4,933 పరిష్కరించామని తెలిపారు. సమావేశంలో చిత్తూరు, పలమనేరు, నగరి, కుప్పం, ఆర్డీఓలు శ్రీనివాసులు, భవానీ, భవానీ శంకరి, శ్రీనివాసులు, ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ వాసుదేవన్, సిబ్బంది ఉమాపతి, మనోజ్, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉదయ్, అట్లూరి శ్రీనివాసులు, సురేంద్ర, యశ్వంత్, సుబ్రమణ్యం, లోకనాథం, గంగరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment