సారా నిర్మూలనకు ప్రణాళికలు
● సారా అనర్థాలపై అవగాహన కల్పించండి ● సమావేశంలో కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో నాటు సారా తయారీ, అమ్మకం, రవాణా చట్టరీత్యా నేరమని కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో నవోదయం 2.0 కార్యక్రమం అమలుపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నవోదయం 2.0 ద్వారా నాటు సారాను పూర్తిగా నిర్మూలించడానికి ప్రణాళికలను సిద్ధం చేసిందన్నారు. ఈ కార్యక్రమం అమలులో ఎకై ్సజ్, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నాటు సారా తయారీ, అమ్మకం, రవాణా చట్టరీత్యా నేరమన్నారు. చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే పీడీ యాక్ట్ కు గురవుతారని హెచ్చరించారు. నాటుసారా వినియోగం వల్ల కలిగే అనర్థాలను క్షేత్రస్థాయిలో అధికారులు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో చిత్తూరు అర్బన్, రూరల్, కార్వేటినగరం, నగరి, పుంగనూరు, కుప్పం, పులిచెర్ల మండలాల్లోని 52 గ్రామాల్లో నాటుసారా తయారీ, వినియోగం ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు.
ప్రత్యేక కార్యాచరణ..
జిల్లాలో నాటుసారాను నిర్మూలించేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కేటగిరీల వారీగా గ్రామా లకు ఎకై ్సజ్, ప్రొహిభిషన్ అధికారులను నియమించి కార్యాచరణ ప్రణాళికను అమ లు చేయాలన్నారు. నాటుసారా తయారీకి ప్రధాన ముడి సరుకుగా వాడే నల్లబెల్లం అమ్మకాలను నియంత్రించాలన్నారు. నాటుసారా తయారీదారులను గుర్తించి కళాజాతలు, గ్రామ సభలు, గోడపత్రికలు, కరపత్రాలు, స్వయం సహాయక సంఘాలు, ఎన్జీఓ ల ద్వారా అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. నాటుసారా తయా రు చేసే వారికి ప్రత్యామ్నాయంగా జీవనోపాధులు కల్పించడానికి చర్యలు చేపట్టాలని డీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. నాటుసారా తయారీ, రవాణా, వినియోగం పై సమాచారం తెలిసిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 14405 కు కాల్ చేసి తెలియజేయాలని కోరారు. ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ.. నాటుసారా తయారీ, అమ్మకం, రవాణా పై సంబంధిత శాఖలతో కలసి పోలీస్ యంత్రాంగం పనిచేస్తోందన్నారు. చట్ట రీత్యా నేరమైన సారా తయారీ, అమ్మకాలు, తదితరాల కారణాల వలన పట్టుబడితే జరిమానాలు విధిస్తామని హెచ్చ రించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి, డీఎఫ్‌వో భరణి, ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ విజయ శేఖర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, తహశీల్దార్‌లు, ఇతర సంబంధిత అధికారులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment