
బంజారాహిల్స్: ప్రేమిస్తావా.. లేదంటే చస్తావా.. నేనే చావాలా.. అంటూ ఓ యువకుడు వెంటపడి వేధిస్తున్నాడని ఓ యువతి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని నందినగర్‌లో నివసించే ఓ యువతి(24) ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ఇదే ప్రాంతానికి చెందిన గణేష్ అలియాస్ చింటు నిత్యం ఆఫీస్‌కు వెళ్లే సమయంలో ఆమె వెంటపడి అడ్డగిస్తూ ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు.
ఆమె పని చేస్తున్న చోటుకు వెళ్లి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. తరచూ తన ఇంటికి వచ్చి ప్రేమిస్తావా లేదా అని డిమాండ్ చేయడమే కాకుండా ఆఫీస్‌లో అందరి ముందే అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఆమె ఫోన్‌ను కూడా ట్రాప్ చేసి సోషల్ మీడియాలో ఫొటోలు పెడతానని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేయగా పోలీసులు గణేష్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: కొత్త ట్విస్ట్: వదినా..మరిది..కొడుకు.. ఓ క్రైం కథ)
Comments
Please login to add a commentAdd a comment