
ప్రతీకాత్మక చిత్రం
పాట్నా : చనిపోయింది అనుకున్న ఓ మహిళ తిరిగొచ్చి, బిహార్ పోలీసుల అరకొర దర్యాప్తుకు నిదర్శనంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. 2019 మేలో బిహార్ శరణ్ జిల్లాకు చెందిన స్వీటీ కుమారీ అనే మహిళ, ఏడేళ్ల కుమారుడు పవన్‌తో కనిపించకుండా పోయింది. రెండు రోజుల తర్వాతో ఓ గుర్తుతెలియని మృతదేహం ఒకటి అక్కడికి దగ్గరలోని నదీ తీరంలో దొరికింది. స్వీటీ తండ్రి ఆ మృతదేహాన్ని చూసి, తమ కూతురిదేనని చెప్పాడు. దీంతో మిస్సింగ్ కేసు కాస్తా హత్యకేసుగా మారింది. ఆమె తండ్రి అత్తవారింటిపై కేసు పెట్టాడు. మూడు నెలల పాటు విచారణ చేసిన పోలీసులు మహిళ మరుదులు, వదిన ఈ హత్య చేశారని తేల్చారు. ( ఇష్టం లేని పెళ్లి.. పరువు హత్యకు దారి)
అనంతరం వారిని కోర్టులో ప్రవేశపెట్టి జైలు తరలించారు. అయితే కొద్దిరోజుల తర్వాత చనిపోయారనుకుంటున్న మహిళ ముజఫర్‌పూర్‌లో ప్రాణాలతో దర్శనమిచ్చింది. దీంతో ఆమెను శరణ్‌కు తీసుకువచ్చారు. మళ్లీ విచారణ ప్రారంభించారు. ముజర్‌పూర్‌కు చేరటానికి ముందు ఆమె ఓ వ్యక్తితో కలిసి ముంబై పారిపోయినట్లు తేలింది. మరికొద్ది రోజుల్లో ఆమెను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. జైలు పాలైన వారిపై కేసులు తొలిగించి, బయటకు తీసుకువచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment