ఆడుకుందామని పిలిచి.. మైనర్‌బాలికపై సామూహిక లైంగిక దాడి | Delhi Police Arrested Two Boys For Molesting Minor Girl | Sakshi
Sakshi News home page

ఆడుకుందామని పిలిచి.. మైనర్‌బాలికపై సామూహిక లైంగిక దాడి

Jan 26 2022 4:11 PM | Updated on Jan 26 2022 9:58 PM

Delhi Police Arrested Two Boys For Molesting Minor Girl - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మైనర్‌ బాలిక తన ఇంటి బయట ఆడుకుంటుండగా, అదే ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలుడు ఆమెతో మాటలు కలిపి ఆడుకుందామని బాలికను ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లాడు.

న్యూఢిల్లీ:  మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగికిదాడులకు అడ్డుకట్టకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా అవి ఆశించినంత స్థాయిలో ఫలితాలని ఇవ్వడం లేదనే చెప్పాలి. ఇటీవల జరుగుతున్న ఘటనల్లో.. కొన్ని వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు కూడా నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇద్దరు మైనర్లు ఎనిమిదేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో చోటు చేసుకుంది. 

వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మైనర్‌ బాలిక తన ఇంటి బయట ఆడుకుంటుండగా, అదే ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలుడు ఆమెతో మాటలు కలిపి ఆడుకుందామని బాలికను ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఘటనా స్థలానికి మరో బాలుడు కూడా చేరుకున్నాడు. అనంతరం వార్దిదరు ఆ బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి వారు అక్కడ నుంచి పారిపోయారు. బాధితురాలు సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చినప్పుడు, ఆమె తన కడుపు, ప్రైవేట్ భాగాలలో నొప్పి గురించి తన తల్లికి ఫిర్యాదు చేసి, తరువాత జరిగిన సంఘటన గురించి ఆమెకు చెప్పింది. ( చదవండి: ఒక్క క్షణం ఆలోచించి ఉంటే.. ఈ విషాదం ఉండేది కాదు! )

దీంతో బాధితురాలి తల్లి ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు మైనర్‌ బాలురను అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకు తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నందున, ఆమెను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆమెకు శస్త్రచికిత్స అందించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement