
బీఈఓ కమలాకర్ (ఫైల్)
యశవంతపుర(కర్ణాటక): తాలూకా స్థాయి విద్యాధికారి అనారోగ్య కారణాలతో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన బెంగళూరు కోడిగేహళ్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు... నగర జిల్లాలోని యలహంక బ్లాక్ విద్యాధికారి (బీఈఓ)గా శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకా టెంకబైలుకు చెందిన కమలాకర్ (52) నాలుగేళ్ల నుంచి పని చేస్తున్నారు.
చదవండి: స్నేహితురాలి పుట్టినరోజు.. యువతుల కార్ల రేస్.. చివరికి ఏం జరిగిందంటే?
ఇటీవల కమలాకర్ అనారోగ్యానికి గురయ్యారు. బెంగళూరులోని ఇంట్లో ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఇంటికి దగ్గర్లోని ఖాళీ స్థలంలో పిస్టల్‌తో తలపై కాల్చుకోవడంతో ప్రాణాలు వదిలాడు. అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కోడిగేహళ్లి పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.