
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బనశంకరి(కర్ణాటక): ఓ ప్రేమ ఉదంతం విషాదాంతమైంది. అర్ధరాత్రి ఇంటికి వచ్చిన ప్రియున్ని ప్రియురాలి తండ్రి హత్య చేశాడు. ఈ ఘటన గత 28వ తేదీ రాత్రి జరగ్గా, ఆదివారం నిందితున్ని అరెస్టు చేశారు. బెంగళూరులో వినోబానగర ఆటోడ్రైవరు నారాయణ్‌కు కూతురు ఉంది. తమిళనాడు కు చెందిన నివేశ్ కుమార్ అనే యువకుడు రెండునెలల క్రితం ఇదే ప్రాంతానికి వచ్చి పెదనాన్న ఇంట్లో ఉంటున్నాడు.
నారాయణ్ కూతురితో నివేశ్ ప్రేమాయణం ప్రారంభించాడు. యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో నివేశ్ వెళ్లాడు. ఇంతలో నారాయణ్ రావడంతో ఇద్దరినీ చూసి పట్టలేని కోపంతో కట్టెతో నివేశ్ తలపై కొట్టడంతో కుప్పకూలిపోయాడు. వేకువజామున ఆటోలో మృతదేహాన్ని తీసుకెళ్లి విక్టోరియా ఆసుపత్రి వద్ద పెట్టి అక్కడ నుంచి ఉడాయించాడు. పోలీసులు దర్యాప్తు చేసి ప్రియుని తండ్రి హత్య చేశాడని గుర్తించి అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment