కారు– బస్ ఢీకొన్న చిత్రం
యశవంతపుర(బెంగళూరు): నూనూగు మీసాలు రాకుండానే నూరేళ్లు నిండాయి. హాసన్ జిల్లా బేలూరు తాలూకా సంకేనహళ్లి వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదు మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మృతులు అక్మల్, జిలాని, మోహమ్మద్ కైఫ్, మోహిన్, రియాన్‌లుగా గుర్తించారు. వీరందరి వయస్సు 18– 20 ఏళ్ల మధ్య ఉంటుంది. వివరాలు.. మోహిన్, రియాన్‌లో హాసన్‌లో పీయూసీ చదువుతున్నారు. మహమ్మద్ కైఫ్, జిలాని, అక్మల్ బేలూరులో పీయూసీ విద్యార్థులు.
వీరందరూ స్నేహితులు. అందరూ కారులో బేలూరు నుంచి హాసన్‌కు విహారానికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కేఎస్ ఆర్‌టీసీ బస్ ఢీకొట్టింది. తీవ్రగాయాలతో నలుగురు విద్యార్థులు అక్కడే మృతి చెందగా, మరొకరిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. బస్ వేగంగా ఢీకొనడంతో దేహాలు నుజ్జునుజ్జయి కారులో చిక్కుకున్నాయి. మృతదేహాలకు బేలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.
చదవండి: ప్రైవేట్ పాఠాల పేరుతో పిల్లల తండ్రులకు గాలం, ఆపై ‘కట్నం’ పేరిట బ్లాక్‌మెయిలింగ్..
Comments
Please login to add a commentAdd a comment