సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. సినిమాల్లో పెట్టుబడుల పేరుతో రూ.6 కోట్ల మోసం జరిగింది. 30 మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, వారి బంధువులే టార్గెట్‌గా వారి నుంచి 6 కోట్లు వసూళ్లు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పేర్లతో కూకట్‌పల్లికి చెందిన కొంగర అంజమ్మ చౌదరి,నాగం ఉమాశంకర్‌లు మోసాలకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలంటూ బాధితులు సీసీఎస్ ముందు ఆందోళనకు దిగారు.
చదవండి: కోడి గుడ్డు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఫిల్మ్ ఇండస్ట్రీ, డిస్ట్రిబ్యూషన్, రియల్ ఎస్టేట్, బొర్ వెల్స్ పలు రంగాలలో పెట్టుబడుల పేరుతో భారీ మోసాలకు పాల్పడ్డారు. ఆర్‌ఆర్‌ఆర్, అల వైకుంఠపురం, లవ్ స్టొరీ, నిశ్శబ్దం, వెంకీ మామ, రాక్షసుడు, నాంది పలు సినిమాలలో పెట్టుబడులు పెడతామని, వాటిలో పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు ఇస్తామని వారు నమ్మించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులైన కొంగర అంజమ్మ చౌదరి, నాగం ఉమా శంకర్‌లను సీసీఎస్ పోలీసులు అదువులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు బాధితులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment