నందిని (ఫైల్)
సాక్షి, ధర్మారం(కరీంనగర్): తల్లి మరణించడం.. నానమ్మ, తాత వద్ద ఉంటున్న బాలికను పెద్దమ్మ, పెద్దమ్మ కుమారుడు తరచుగా దూషించడంతో మనస్తాపం చెందిన బాలిక ధర్మారం మండలం కొత్తూరు గ్రామశివారులోని పోగు ల రాజేశం వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చొటుచేసుకుంది. ధర్మారం ఏఎస్సై రవికుమార్ కథ నం ప్రకారం.. జూలపల్లి మండలం నిమ్మపల్లికి చెందిన చొప్పరి నందిని (18) తల్లి మరణించడంతో తండ్రి నర్సింగంతో పాటు నానమ్మ కోమురవ్వ, తాత లస్మయ్యతో కలిసి ఉంటోంది.
పదో తరగతి వరకు చదివిన నందిని పై చదువులు చదివించకపోవడంతో తండ్రితో కలిసి నానమ్మ, తాత ఇంట్లోనే ఉంటోంది. దీంతో నర్సింగం సోదరుడి భార్య చొప్పరి రాణి, కుమారుడు విష్ణువర్ధన్ నందినికి మాకంటే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారని భావించి తరచూ నందిని దూషించేవారు. నాలుగు రోజుల క్రితం నానమ్మ, తాతతో కలిసి ఇంట్లో భోజనం చేస్తుండగా రాణి, విష్ణువర్థన్‌లు వచ్చి గొడవకు దిగారు. ఎందుకు తిడుతున్నారని నందిని వారిని ప్రశ్నించగా ఆగ్రహంతో రాణి, విష్ణవర్థన్‌లు నానమ్మ తింటున్న ప్లేట్లో నీళ్లుపోసి నందినిని దూషించారు. దీంతో మనస్తాపం చెందిన నందిని కొత్తూరు శివారులోని వ్యవసాయ బావిలో ఆదివారం దూకి ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి నర్సింగం ఫిర్యా దుతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై రవికుమార్ తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment