ఏడాదిన్నరగా భార్యను, కూతుళ్లను ఇంట్లోనే నిర్భందించాడు! | Husband Molesting His Wife In Maharashtra | Sakshi
Sakshi News home page

ఏడాదిన్నరగా భార్యను, కూతుళ్లను ఇంట్లోనే నిర్భందించాడు!

Published Thu, Jun 3 2021 4:47 PM | Last Updated on Thu, Jun 3 2021 5:57 PM

Husband Molesting  His Wife In Maharashtra - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ముంబై:  మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. ఏడాదిన్నర కాలంగా కట్టుకున్న భార్యనే ఇంట్లో నిర్భందించి లైంగికంగా వేధించిన  ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  వివరాలు.. మహరాష్ట్రలోని పండర్​పుర్​ నగరానికి చెందిన సదరు వ్యక్తి  తన భార్యను , ముగ్గురు కూతుళ్లను ఒకటిన్నర సంవత్సరాలుగా ఇంట్లోనే బంధించాడు. ఇంతటితో ఆగకుండా తన భార్యపట్ల అమానుషంగా ప్రవర్తించాడు. 

ఈ క్రమంలో, భర్త  ప్రవర్తన పట్ల విసుగెత్తిపోయిన ఆ మహిళ స్థానిక  పోలీసు అధికారులకు ఎస్​వోఎస్​ మెస్సెజ్​ చేసి, తన గొడును చెప్పుకుంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పండర్​పుర్​ నగరంలోని జెండాగుల్లి ప్రాంతంలోని నిందితుడి ఇంటిపై దాడిచేశారు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళను, ముగ్గురు కూతుళ్లను విడిపించారు. అయితే,  నిందితుడిపై పలు సెక్షన్​ల కింద కేసులను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, పోలీసుల ప్రాథమిక విచారణలో ఆ మహిళకు కొడుకులు పుట్టక పోవడం వలనే  క్రూరంగా ప్రవర్తించాడని  తెలిసింది. 

చదవండి: ఘోరం: తండ్రి బర్త్‌డే కేక్‌ కోసం బయటకొచ్చిన యువకుడిని..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement