
మానేరు వాగు
సాక్షి, కరీంనగర్ : మానేరు వాగులో ప్రమాదవశాత్తు పడి తల్లి కొడుకు మృతి చెందారు. మృతులు కాశ్మీర్ గడ్డకు చెందిన మహిళ సకీనా ఆమె మూడేళ్ళ కుమారుడు అహిల్ గా గుర్తించారు. కుటుంబంతో కలిసి సదాశివపల్లి వద్ద గల దర్గాకు వెళ్లి తీగల వంతెనవద్ద మానేరు వాగు లోకి దిగారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో తల్లి కొడుకు గల్లంతయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎల్‌ఎండీ గేట్లు మూసివేశారు.
(చదవండి : హైదరాబాద్‌లో యువతి దారుణ హత్య )
కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు అప్రమత్తమై గాలించగా అప్పటికే తల్లి మృతి చెందింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొడుకును పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేసి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు సైతం ప్రాణాలు కోల్పోయాడు. కళ్ళ ముందే ఇద్దరు వాగులోపడి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విహారయాత్ర దైవదర్శనం విషాదంగా మారడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment