
సాక్షి, అక్కన్నపేట(మెదక్): కని పెంచిన కూతురునే కడతేర్చింది ఓ తల్లి. ఈ దారుణం అక్కన్నపేట మండలం మల్‌చెర్వుతండాలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తలపై వెనకనుంచి బలంగా కొట్టి.. తండాకు చెందిన భూక్య తిరుపతి, మమత అలియాస్ రాణి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. కొంతకాలంగా మమత మానసికస్థితి సరిగ్గా లేదు. ఆస్పత్రిలో చికిత్స చేయించినా ఆమె ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదు. దీంతో పెద్ద కూతురు భూక్య సోని(09) ఇంటివద్దే ఉంటూ అన్ని పనులు చేస్తోంది.
రోజులాగానే బుధవారం తెల్లవారు జామున అన్నం వండేందుకు సోని బస్తా నుంచి బియ్యం తీస్తున్న క్రమంలో ఒక్కసారిగా తల్లి మమత రోకలిబండతో తలపై వెనకనుంచి బలంగా కొట్టింది. దీంతో సోని అక్కడికక్కడే కిందపడి మృతి చెందింది. ఇంటి చుట్టుపక్కల వారు గమనించి లారీ డ్రైవర్‌గా పని చేసేందుకు వెళ్లిన తండ్రి తిరుపతికి సమాచారం అందించారు. వెంటనే తిరుపతి ఇంటికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా సంఘటనా స్థలాన్ని అడిషనల్ ఎస్పీ సందేపోగు మహేందర్, సీఐ లేతాకుల రఘు పతి, ఎస్సై కొత్తపల్లి రవి పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment