
ప్రమాదానికి గురైన వాహనాలు
అనకాపల్లి టౌన్: ఆగి ఉన్న కంటైనర్‌ను మినీవ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్, క్లీనర్ మృతిచెందారు. ట్రాఫిక్ సీఐ సీహెచ్.ప్రసాద్ తెలిపిన వివరాలిలా ఉన్నా యి. మరమ్మతులకు గురవడంతో అనకాపల్లి జాతీయ రహదారిపై శారదానది బ్రిడ్జి సమీపంలో ఓ కంటైనర్ సోమవారం నిలిచిపోయింది. కంటైనర్ డ్రైవర్ కిందకు దిగి పరిశీలిస్తున్న సమయంలో అదే రహదారిలో బెంగళూరు నుంచి ద్రాక్షపళ్ల లోడుతో కోల్‌కత్తాకు వెళ్తున్న వ్యాన్.. కంటైనర్ వెనుకభాగంలో ఢీకొంది.
వ్యాన్ డ్రైవర్ దినేష్‌రెడ్డి(25) అక్కడికక్కడే మృతి చెందాడు. క్లీనర్ వెంకటేష్(25) తీవ్రంగా గాయపడడంతో ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన ఎన్టీఆర్ వైద్యాలయానికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకటేష్ మరణించాడు. మృతుల కుటుంబాలకు సమాచారం అందజేసినట్టు సీఐ చెప్పారు. పొక్లెయిన్ సాయంతో రెండు వాహనాలను వేరుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment