సాక్షి, శ్రీకాకుళం: చీకటిలో కాకుండా కాస్త వెలుగు వచ్చాక బయల్దేరి ఉంటే ఆ తల్లీకొడుకులు బతికి ఉండే వారేమో..? కాసింత నెమ్మదిగా దారి చూసుకుంటూ వెళ్లి ఉంటే ఆయువు నిలిచి ఉండేదేమో..? ఆ కల్వర్టు ముందు మలుపు తీసుకుని ఉన్నా.. ఈ పాటికి ఇంటిలో నవ్వుతూ తిరిగేవారేమో..? ఆ ప్రదేశంలోనే వారి మృత్యువు రాసి పెట్టి ఉన్నట్లు కల్వర్టులో పడి ఇద్దరూ కన్నుమూశారు. సారవకోట మండలంలోని బుడితి జంక్షన్‌కు సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన తల్లి, కుమారుడు కలగ రమణమ్మ(38) మణికంఠ (19)లు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు..
వేకువజామున..
పెద్దపాడు గ్రామానికి చెందిన తల్లీకొడుకులు గురువారం జలుమూరు మండలంలోని అచ్చుతాపురం గ్రామంలో జరిగిన యాదవుల గావు పండుగకు వెళ్లారు. రాత్రి బంధుమిత్రులతో సరదాగా గడిపి వేకువజామునే బైక్‌పై స్వగ్రామానికి బయల్దేరారు. చల్లవానిపేట, శ్రీముఖలింగం రో డ్డు విస్తరణ పనుల్లో భాగంగా బుడితి జంక్షన్‌కు సమీపంలో కల్వర్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ కల్వర్టు నిర్మాణం కోసం డైవర్షన్ ఏర్పాటు చేశారు. కానీ వేకువజామున ప్రయాణం పెట్టుకున్న మణికంఠ ఈ డైవర్షన్‌ను గమనించలేదు. బండిని పక్కకు తిప్పకుండానే రుగా ముందుకు వెళ్లడంతో బైక్‌తో సహా కల్వర్టులో పడి అక్కడికక్కడే తల్లీకొడుకు మృతి చెందారు. స్థానికులు వీరిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతుల కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. మణికంఠకు ఇద్దరు అక్కలు ఉన్నారు. ఒక్కడే కొడుకు కావడంతో తండ్రి కలగ అప్పారావు గుండెలవిసేలా రోదించారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు హిరమండలం ఎస్‌ఐ మధుసూదనరావు కేసు నమోదు చేసి మృతదేహాలను పాతపట్నం తరలించారు.
చదవండి: విజయనగరం ఎంపీ చంద్రశేఖర్‌కు లోక్‌సభ స్పీకర్ ప్రశంసలు
హెచ్చరిక బోర్డు లేకపోవడం వల్లనేనా..?
కల్వర్టు నిర్మాణ పనులు జరుగుతున్న చోట హె చ్చరిక బోర్డులు లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. అదేమార్గంలో రోడ్డు నిర్మా ణ పనులకు సంబంధించిన వాహనాలను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. పోలీసులు కలగజేసుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ రోడ్డు ప్ర మాదం జరిగిన ప్రదేశం సారవకోట పోలీసు స్టేషన్ పరిధికి వస్తుందా? జలుమూరు పోలీసు స్టేషన్ పరిధికి వస్తుందా అని రెండు మండలాల పోలీసులు సందిగ్ధంలో పడ్డారు. అనంతరం రెవె న్యూ సిబ్బంది సూచన మేరకు సారవకోట పోలీసులు సంఘటనా స్థలం దగ్గర తదుపరి కార్యకలాపాలు నిర్వహించారు.
చదవండి: సీఎంకు హృదయపూర్వక ధన్యవాదాలు: మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్
Comments
Please login to add a commentAdd a comment