
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కకోరిలో దుబ్బగ్గలో లక్నో ఏటీఎస్ అధికారులు ఆదివారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానిత ఉగ్రవాదులకు అల్‌ఖైదాతో సంబంధాలున్నట్లు గుర్తించారు. వారి నుంచి విదేశీ తుపాకులు సహా.. పేలుడు పదార్థాలు ఏటీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అంతేకాకుండా ప్రెజర్ కుక్కర్ బాంబులను కూడా ఏటీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీరియల్ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అయోధ్య, కాశీ పరిసర ప్రాంతాల్లో భారీగా భద్రతను పెంచారు. సకాలంలో ఉగ్రవాదులు పట్టుబడడంతో ప్రమాదం తప్పిందని ఏటీఎస్ అధికారులు పేర్కొన్నారు.