మసాజ్‌ పేరుతో అసహజ ప్రవర్తన | Sakshi
Sakshi News home page

ఓ వ్యక్తిపై ఇద్దరు మహిళలు లైంగిక దాడికి యత్నం

Published Wed, May 1 2024 7:07 AM

Two Womans Blackmail Man In Sanatnagar

సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తామని బెదిరింపులు  

బాధితుడి నుంచి రూ.20 వేలు వసూలు  

మరో 30 లక్షలు కావాలంటూ ఫోన్లు 

పోలీసులను ఆశ్రయించిన బాధితుడు 

నిందితుల అరెస్ట్‌.. రిమాండ్‌కు తరలింపు   

సనత్‌నగర్‌: థెరపిస్టుల ముసుగులో ఇద్దరు మహిళలు ఓ వ్యక్తిపై ‘అసహజ’ దాడికి యత్నంచడంతో పాటు అతడిని నగ్నంగా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తామని బెది రింపులకు దిగారు. దీంతో బాధితుడు భయ పడి రూ.20 వేలు ఇచ్చాడు. కానీ.. మరో రూ.30 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇన్‌స్పెక్టర్‌ పురేందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి.. సనత్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తికి తనకు తానుగా థెరపిస్టుగా చెప్పుకున్న ఓ మహిళ పరిచయమైంది. 

ఆమె ద్వారా భరత్‌నగర్‌కు చెందిన మరో మహిళ ఫోన్‌ నంబర్‌ను తీసుకుని మాట్లాడాడు. తాము థెరపిస్టులమని, మసాజ్‌ చేస్తామంటూ సదరు వ్యక్తితో నమ్మబలికారు. దీంతో అతడు ఆ ఇద్దరు మహిళలు చెప్పిన్నట్లుగా భరత్‌నగర్‌లోని వారి ఇంటికి వెళాఉ్లడు. అయితే.. పరిస్థితులపై అనుమానం వచ్చిన బాధితుడు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని భావించాడు. అతడు బయటికి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగానే ఇద్దరు మహిళలు బలవంతంగా నిర్బంధించారు. అతడి ఒంటిపై దుస్తులు తీసి లైంగిక దాడికి యత్నంచారు. ఈ క్రమంలోనే నగ్న వీడియోలు తీశారు. అంతటితో ఆగకుండా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తామంటూ బెదిరించారు.

 అలా చేయకుండా ఉండాలంటే తమకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఆందోళనకు గురైన ఆ వ్యక్తి రూ.20 వేలు ఆన్‌లైన్‌ ద్వారా వారికి ఇచ్చాడు. వారి బారి నుంచి బయటపడ్డానని భావిస్తున్న క్రమంలోనే మళ్లీ ఓ మహిళ ఫోన్‌ చేసి రూ.30 లక్షలు ఇవ్వాలని, లేకపోతే వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో పాటు కుటుంబ సభ్యులకు పంపిస్తామని బెదిరించింది. దీంతో బాధితుడు సనత్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.   

Advertisement
 

తప్పక చదవండి

Advertisement