కడప అర్బన్/పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక నిందితుడిని సీబీఐ గురువారం అరెస్టు చేసింది. 95వ రోజు కొనసాగిన విచారణలో కడప కేంద్ర కారాగారంలోని గెస్ట్‌హౌస్‌లో సీబీఐ అధికారులు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అనుచరుడు, అనుమానితుడు, పులివెందుల కు చెందిన పాలవ్యాపారి గజ్జల ఉమాశంకర్ రెడ్డిని, ఓ పత్రికా విలేకరి భరత్‌యాదవ్‌ను విచారించి పలు కీలక అంశాలను సేకరించారు. అనంతరం ఉమాశంకర్‌రెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.
పులివెందుల మేజిస్ట్రేట్ పవన్‌కుమార్ అతడికి 14 రోజులపాటు రిమాండ్ విధించారు. సీబీఐ అధికారులు ఉమాశంకర్‌రెడ్డిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా, దస్తగిరి స్టేట్‌మెంట్ ఆధారంగా మరికొంతమందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. వివేకా హత్యకేసులో ఇప్పటికే సీబీఐ అధికారులు సునీల్‌యాదవ్‌ను రిమాండ్‌కు పంపగా.. వాచ్‌మెన్ రంగయ్య, మాజీ డ్రైవర్ దస్తగిరితో 164 స్టేట్‌మెంట్ కింద వాంగ్మూలాన్ని కోర్టులో రికార్డు చేసిన విషయం విదితమే.
ఇవీ చదవండి:
భారీ నగదుతో పరుగులు తీసిన డీఎస్పీ.. విషయం ఏంటంటే..
Facebook: ఫేస్‌బుక్ కళ్లద్దాలు.. ఇక ఫొటో, వీడియోలు తీయొచ్చు
Comments
Please login to add a commentAdd a comment