
లక్నో: ఉద్యోగం చేస్తున్నప్పడు బదిలీలు అనేవి సహజం. ఈ క‍్రమంలోనే ఓ ఉద్యోగి తనను బదిలీ చేయాలని ఉన్నతాధికారిని అడిగాడు. అనంతరం సదరు ఉన్నతాధికారి.. బదిలీ కావాలంటే తన భార్యను ఓ రాత్రికి పంపమని షరతు పెట్టాడు. దీంతో సదరు ఉద్యోగి తీవ్ర ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. గోకుల్ ప్రసాద్(45) విద్యుత్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా, అతను ప్రతీరోజు లఖింపూర్ నుంచి అలీగంజ్‌కు ప్రయాణం చేసి ఉద్యోగం చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో తనను బదిలీ చేయాలని ఉన్నతాధికారులను కోరాడు. ఆ సమయంలో జూనియర్ ఇంజినీర్.. ట్రాన్స్‌ఫర్ కావాలంటే తన భార్యను ఓ రాత్రికి తన వద్దకు పంపమని అడిగాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన గోకుల్.. ఆఫీసు బయట ఒంటిపై డీజిల్‌పోసుకుని నిప్పంటించుకున్నాడు. అనంతరం తోటి ఉద్యోగులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.
ఈ నేపథ్యంలో మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్బంగా నిందితులు గత మూడేళ్లుగా గోకుల్‌ను చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించింది. దీంతో అతను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడని పేర్కొంది. కానీ, వారు మాత్రం అతనిని విడిచిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేసింది. వారిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జూనియర్ ఇంజినీర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఇక, ఈ ఘటనతో జూనియర్ ఇంజినీర్, క్లర్క్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment